నందమూరి అండ్ అక్కినేని కంప్లీట్ కటీఫ్?

September 23, 2015 | 05:22 PM | 2 Views
ప్రింట్ కామెంట్
nandamuri-akkineni-family-clashes-niharonline.jpg

వారిద్దరు తెలుగు చలన చిత్ర సీమకు రెండు కళ్లు. దశాబ్దాల పాటు వెలిగిన స్టార్లుగా వెలిగిన నటులు. 60 సంవత్సరాలపాటు టాలీవుడ్ ను శాసించటంతోపాటు ఎవర్ గ్రీన్ నటులుగా దేశ వ్యాప్తంగా మనన్నలు అందుకున్న లెజెండ్ లు. వారే స్వర్గీయ నందమూరి తారకరామారావు మరియు అక్కినేని నాగేశ్వర రావు. సినిమాల విషయాల్లో పోటా పోటీగా ఉన్నప్పటికీ వారి మధ్య ఎప్పుడూ మైత్రి కొనసాగేది. ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నప్పటికీ,  వారి టైంలో స్నేహ పూర్వక వాతావరణం ఎప్పుడూ ఉండేది. స్టార్ డమ్ లను పక్కన బెట్టి సేవా కార్యక్రమాలు లాంటివి ఇద్దరు కలిసే చేసేవారు. వారి మధ్య స్నేహం ఎంతలా ఉండేదంటే రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎన్టీఆర్ ఏఎన్నార్ ని సలహా అడిగి మరి వచ్చారట. ఒక వేళ ఆయన నో అని ఉంటే నేను రాజకీయాల్లోకి అసలు వచ్చే వాడినే కాదు అని ఎన్టీఆర్ బహిరంగంగా చాలా సార్లు ప్రకటించారు కూడా. మరో వైపు నాగేశ్వరావు కూడా ఎన్టీఆర్ తో అనుబంధం గురించి చాలా సార్లు చెప్పుకొచ్చారు కూడా. వారు సినిమాల్లో కొనసాగుతుండగానే వారసులను కూడా పరిశ్రమలోకి దించారు. ఇక వారు కూడా మొదట్లో అదే స్నేహ పూర్వక వాతావరణాన్ని మెయింట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ అక్కినేనిని బాబాయ్ అని పిలవటం బట్టి చెప్పొచ్చు ఎంత అభిమానమో. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి?

                     అయితే గత కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు రగులుతూనే ఉన్నాయి. ఓ పంక్షన్ ఆహ్వాన పత్రికలో ఎన్టీఆర్ ఫోటో పెట్టకపోవటంతోపాటు బాలయ్యను ఆహ్వనించలేదట. దానిపై అలకబూనిన బాలయ్యకి నాగ్ సర్థిచెప్పబోగా ఆయన మరింత ఫీలవ్వటంతో ఈ అసలు మ్యాటర్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక అక్కడి నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయట. అక్కడి నుంచి ఏ పంక్షన్లో, వేడుకల్లో ఎదురైనా ఇద్దరు పలకరించుకోవటం పూర్తిగా మానేశారు. ఒకే వేదికపై ఉన్నా ఎడమోహం పెడ మోహం పెట్టుకుంటూ కనిపించారు.  అక్కినేని చనిపోయాక కూడా బాలయ్య ఎక్కడ కనిపించలేదు. అయితే నాగ్ మాత్రం మనసులో ఏం పెట్టుకోకుండా నందమూరి జానకీరాం చనిపోయిన సమయంలో హరికృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించాడు. అయినా బాలయ్య మాత్రం మొండిపట్టు పట్టి అక్కినేని ఫ్యామిలీ తో సంబంధాలను తెంచుకున్నారట. దీంతో నాగ్ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా అఖిల్ ను లాంఛింగ్ దగ్గరి నుంచి మొన్నటి ఆడియో పంక్షన్ దాకా ఎక్కడా నందమూరి ఫ్యామిలీ ప్రస్తావన రాలేదు. ఆఖరికి అఖిల్ కి ఆల్ ది బెస్ట్ చెప్పినవారిలో నందమూరి ఫ్యామిలీ వారు ఎవరూ లేకపోవటం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది. వారి తండ్రులు ఎంత మైత్రితో ఉన్నారో వీరు అంత శత్రుత్వం చూపుతున్నారట సినీ పెద్దలు కాస్త గట్టిగానే చర్చించుకుంటున్నారట. ఇదంతా చూస్తుంటే నందమూరి కి అక్కినేనికి ఇక పూర్తిగా చెడినట్లేనా అని అనుకుంటున్నారు అంతా. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే పోలా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ