విశాల్ సినిమాకు వదిన సాయం

January 10, 2015 | 03:33 PM | 59 Views
ప్రింట్ కామెంట్

పొగరు సినిమాలో విశాల్ అంటే పడి చచ్చే లేడీ విలన్ పాత్రలో నటించిన శ్రియా రెడ్డి గుర్తుండే ఉంటుంది. ఆమె ఎవరో కాదు విశాల్ కు స్వయానా వదిన. విశాల్ సోదరుడు విక్రమ్ కి భార్య. ఆమె ఇప్పుడు విడుదలైన విశాల్ ‘మగ మహారాజు’ సినిమాకు ప్రచారం చేస్తోంది. ఈ చిత్రం తెలుగులో త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచారం నిన్ననే హైదరాబాద్ లో మొదలైంది. టీజర్ను, రెండు పాటల్ని మీడియాకి చూపించారు. ఈ వేడుకలో ప్రత్యేక అతిథిగా పాల్గొంది శ్రీయా రెడ్డి. ఈమె తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. అయితే మగమహారాజు సినిమా ప్రమోషన్ లో విశాల్ బాగా నటించాడనీ, పెద్ద విజయం అందుకుంటాడనీ, వదినమ్మ తన వంతు ప్రచారం బాగాచేశారు. హీరోయిన్ గా, ఎస్ ఎస్ మ్యూజిక్ ఛానెల్ కి యాంకర్ గా శ్రీయారెడ్డి సుపరిచితమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ