మా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

March 27, 2015 | 05:23 PM | 48 Views
ప్రింట్ కామెంట్
judgement_maa_elections_niharonline

మా ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తదుపరి తీర్పు వెల్లడి చేసే వరకూ ఫలితాలు తెలియపరచకూడదని కూడా కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో ఇప్పటి వరకూ ఉత్కంఠగా ఉన్న సినీ వర్గాలు ఊపిరి తీసుకున్నాయి. మా అసోసియేషన్ కు జరుగుతున్నఎన్నికలను సిటీ కోర్టుకు నటుడు కళ్యాణ్ పిటిషన్ వేశాడు. ఆయన ఈ ఎన్నికల్లో అక్రమాలు అందుకే నిలిపి వేయాలను కోర్టును కోరాడు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ‘మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి అలీకి నోటీసులు జారీ చేశారు. ఈసారి ఎన్నికలు పరిశ్రమను రెండు వర్గాలుగా చీల్చిందనే చెప్పాలి. కొందరు రాజేంద్రప్రసాద్‌వైపుకు వెళితే, మరికొందరు జయసుధకు మద్దతు పలికారు. సమావేశాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ముమ్మరమయ్యాయి. ఇక ఎన్నికలు జరిగే లోగా మరికొందరు సినీ నటులు తమ వాక్కలు కూడా వినిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ