స్వర్గీయ నందమూరి జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న సినిమా దానవీర శూరకర్ణ. ఈ చిత్రానికి జేవీఆర్ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావు నిర్మాతలు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. జులై నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ‘బాల రామాయణం’ తర్వాత అందరు బాల నటీనటులతో వస్తున్న చిత్రం ఇది. స్వర్గీయ జానకీరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్నారు. ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారు. నటనలో తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటున్నారు. వారితోపాటు మిగతా బాలనటులంతా కూడా అద్భుతంగా నటించారు. దర్శకుడు జేవీఆర్ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో బాగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి కౌలస్యం సంగీతం అందించారు. అన్ని పాటలు బాగా వచ్చాయని అన్నారు.