లౌక్యం తెలిసిన నటుడు, బిజినెస్ మ్యాన్ అని నాగార్జునకు పేరుంది. అన్నిటిలోనూ ఆచీ తూచీ ఆలోచించి అడుగులు వేస్తాడు. పైసా నష్టం కలుగుతుందంటే అందులో వేలు పెట్టడు. తాను చేసే వ్యాపారాల విషయాలలోనే కాదు తాను నిర్మించే సినిమాల విషయాలలో కూడా చాల ప్రాక్టికల్ గా నాగార్జున వ్యవహార శైలి ఉంటుందని అతడి సన్నిహితులు అంటుంటారు. నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ సినిమా నిర్మించే బాధ్యతను నితిన్ కు అప్పచెప్పినప్పుడు ఈ సినిమా బడ్జెట్ ను ఎట్టి పరిస్థితుల్లోను 30 కోట్లకు మించవద్దని నాగార్జున నితిన్ ను ముందుగానే హెచ్చరించాడట. అయితే ఈ సినిమాకు వినాయక్ తోడు కావడంతో ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే దాదాపు 40 కోట్లకు చేరుకుందని వార్తలు వస్తున్నాయి. ఇంకా మరో 5 కోట్ల వరకు ఈ సినిమాకు ఖర్చు చేయాల్సి రావచ్చంటున్నారు. ఇవన్నీ తెలుసుకున్న నాగార్జున ఇంత భారీగా ఒకకొత్త హీరో సినిమా పై ఎందుకు ఖర్చు చేస్తున్నారని అంటూ నితిన్ కు క్లాస్ తీసుకున్నాడని టాక్. అఖిల్ స్టామినాను దృష్టిలో పెట్టుకుంటే ఎట్టి పరిస్థితులలోను 35 కోట్లకు మించి ఖర్చు పెట్టడం శ్రేయస్కరం కాదని అంతకు మించి ఖర్చు అవడంతో ఈ సినిమా మార్కెట్ చూయడంలో సమస్యలు తలెత్తితే నిర్మాతగా నితిన్ కు నష్టాలు రావడమే కాకుండా తన కొడుకు అఖిల్ సినిమా సరిగ్గా మార్కెట్ కాలేదు అన్న అపఖ్యాతి తనకు వస్తుందని క్లాసు తీసుకున్నాడని సమాచారం. నాగ్ రెండు విదాలా ఆలోచించిన విధానం చూస్తుంటే... అతని సక్సెస్ మంత్రం ఇట్టే తెలిసిపోతోందనిపిస్తోంది.