శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. జె.వి.ఆర్ దర్శకుడు కాగా, జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావు నిర్మాతలుగా వ్యవహరించారు. స్వర్గీయ నందమూరి జానకిరామ్ తనయులు మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో కనిపిస్తారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘బాల రామాయణం తర్వాత అంతా బాలనటీనటులతో వస్తున్న చిత్రమిది. స్వర్గీయ జానకీరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్నారు. ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారు. నటనలో తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటున్నారు. బాల నటీనటులందరికీ మూడు నెలల ట్రైనింగ్ ఇచ్చి సినిమా చేశాం. దర్శకుడు జెవిఆర్ ప్రతి ఫ్రేమ్ ను ఎంతో బాగా తెరకెక్కించారు. పాటలు, సెట్లు, గ్రాఫిక్స్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది. ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తాం. బాల రామాయణం తరహాలో పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. శ్యామ్ గోపాల్, కారుణ్య, భార్గవి, యామిని, సాహిత్య, విజ్ను, అభిరామ్, చందన్, గణేష్, దినేష్, లోహిత తదితర బాలురు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ మేన్: సి.మాధవరావు, నృత్య దర్శకురాలు: ప్రమీల, కళాదర్శకులు: ఎస్.ఆర్.కె.శర్మ, ఎడిటర్: నందమూరి హరి, కాస్ట్యూమర్: పద్యాలయ మురళి, కో-డైరెక్టర్: పి.ఎన్.రాయ్, పాటలు: గంగోత్రి విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, సంగీతం: కౌసల్య, రచన-దర్శకత్వం: జె.వి.ఆర్, నిర్మాతలు: సిహెచ్.వెంకటేశ్వరరావు, జె.బాలరాజు.