పర్సనల్ గా పిలవలేదనే కినుక?

August 26, 2015 | 03:15 PM | 4 Views
ప్రింట్ కామెంట్
dasari_narayama_pout_about_chir_niharonline

చిరంజీవి బర్త్ డే వేడుకల్లో అతిరథ మహారధులెందరో కనిపించారు గానీ, దర్శకరత్న దాసరి కనిపించలేదు. ఈ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులెందరో తమ హాజరు వేయించుకున్నా... సినీ ప్రతి వేడుకలో హాజరయ్యే దాసరిగారు మాత్రం కనిపించకపోవడంపై పలువురికి ఇది ఒక చర్చనీయాంశం అయ్యింది. ఆ మధ్య సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకలో దాసరి ప్రసంగం మెగా కుటుంబాన్ని గాయపరిచిందని అందుకే పిలిచి ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. కానీ దాసరి గారికి ఆహ్వానమైతే అందింది కానీ, రాంచరణ్ గానీ, చిరంజీవిగానీ పర్సనల్ గా కలవడం గానీ, కనీసం ఫోన్ చేసి పిలవడం గానీ చేయలేదని అనుకుంటున్నారు. పెద్దాయన లేక వేదిక వెలవెలబోయిందే అన్న విమర్శ కూడా వినిపించింది.
రాంచరణ్ టీం ఈ వేడుకకు ఆహ్వానించడానికి చాలా మందిని కలిశారనీ, కానీ ఈ టీమ్ దాసరిని వ్యక్తిగతంగా కలిసి వేడుకకు ఆహ్వానించకపోవడం వల్లే దాసరి డుమ్మా కొట్టారనుకుంటున్నారు. ఆ సంగతిని దాసరి స్వయంగా చెప్పారు. ఒకవేళ నన్ను పర్సనల్ గా కలిసి ఇన్వయిట్ చేసి ఉంటే వచ్చేవాడినే. మా మధ్య ఉన్న వైరాన్ని కూడా వదిలేసే వాడిని. కానీ అలా చేయలేదు కదా! అని దాసరి వ్యాఖ్యానించడం చర్చల్లో కొచ్చింది. చరణ్ అందరికీ పంపినట్టే ఓ ఆహ్వాన పత్రిక రెగ్యులర్ పోస్ట్ లో పంపించేశాడు. అందుకే దాసరి చిరుపై కినుక వహించారని ఫిలింనగర్ జనాలు చర్చించుకుంటున్నారు. అప్పట్లో దాసరితో చెర్రీ ఎపిసోడ్ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ గురించి మరోసారి తవ్వుకుంటున్నారంతా. చరణ్ అలా చేసి ఉండాల్సింది కాదు ఫ్యామిలీలో కీలకమైన సందర్భం కాబట్టి అన్నీ వదిలేసి వ్యక్తిగతంగా కలిసుండాల్సింది... ఎంతైనా పెద్దాయన... అందునా సినీ ఫీల్డ్ లో ప్రముఖుడు... ఇంత చిన్న చూపేల? అనుకుంటున్నారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ