హిందీ సినిమా హీరోల్లో డెడికేషన్ కొంచెం కనిపిస్తుంది. తెలుగు హీరోలయితే కనీసం గుండు గీయించుకోడానికి కూడా సిద్ధపడరు. క్యారెక్టర్ కోసం కష్టపడే వారిలో కోలివుడ్ హీరోలదే మొదటి స్థానం. గతంలో సూర్య, కమల్ వంటి వారు సినిమాలకోసం కొంచెం కష్టపడ్డారు. అందుకే వారినుంచి వెరైటీ సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు 'ఐ' సినిమా కోసం విక్రమ్ పడ్డ కష్టం చూస్తే మన హీరోలు ఎప్పటికీ అతనికి సాటి రాలేదని, హార్డ్ వర్కులో అతడి డెడికేషన్ ముందు నిలబడలేరని అనిపిస్తుంది. ఈ చిత్రంలో విక్రమ్ నాలుగు రకాల గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. ఈ నాలుగు గెటప్స్ కోసం విక్రమ్ తన శరీరాన్ని వివిధ రకాలుగా మార్చుకున్నాడు. బాడీ బిల్డర్ పాత్ర కోసం ఎనభై అయిదు కేజీలు, మోడల్ క్యారెక్టర్ కోసం డెబ్బయ్ కేజీల బరువుకి మారాడు. ఒక మాన్‌స్టర్ గెటప్ కోసం 110 కేజీల బరువు పెరిగిన విక్రమ్... కురూపి పాత్ర కోసం దానిలో సగం బరువుకి తగ్గాడు. మూడేళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం కోసం విక్రమ్ పడ్డ కష్టంతో పోలిస్తే తామెవరం అసలు పనే చేసినట్టు కాదని డైరెక్టర్ శంకర్ మెచ్చుకోవడం చూస్తే అతని కష్టం మనకు కనిపిస్తుంది. విక్రమ్ సహకారం లేకపోతే డైరెక్టర్ శంకర్ ఈ చిత్రం తీయలేకపోయేవాడినని చెప్పుకున్నాడు.