ఒకప్పుడు చిన్న హీరోలతో నటించి తామేంటో నిరూపించుకుని పెద్ద హీరోల పక్కన స్థానం సంపాదించేవారు హీరోయిన్లు. ఇప్పుడు అలా కాదు ఒక కమెడియనో, ఒక చిన్న సినిమాలోనో నటించే హీరోయిన్లు ఇక పెద్ద హీరోలతో నటించే అవకాశాన్ని కోల్పోతున్నారు. కామెడీ హీరోలతో సినిమాలు చేస్తే నిర్మాతలు లాభాల బాటలో పడుతున్నారు కానీ వారి సరసన నటించడం వల్ల హీరోయిన్లకు ఇక సినిమా ఛాన్సులు రావడం లేదు. అల్లరి నరేష్‌తో హిట్స్ ఇచ్చిన ఏ హీరోయిన్ కూడా తర్వాత చెప్పుకోతగ్గ స్థాయికి రాలేదు. అలాగే సునీల్‌తో నటించిన హీరోయిన్లకి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వీరితో నటిస్తే తమ కెరీర్ కు దెబ్బ అని వారి జోలికి పోవడం లేదట హీరోయిన్లు. డబ్బు ఆశకు కూడా లొంగడం లేదట. ఈ ఇబ్బంది హీరోయిన్లతోనే కాకుండా స్టార్ డైరెక్టర్లతో కూడా ఉందట. ఒక్క రాజమౌళిని మినహాయిస్తే మిగతా స్టార్ డైరెక్టర్ ఎవరూ సునీల్, నరేష్‌తో సినిమా ప్లాన్ చేసే ధైర్యం చేయడం లేదంటున్నారు.