ఏమీ లేదంటూనే ఇదేంటమ్మా...?

April 08, 2015 | 12:58 PM | 67 Views
ప్రింట్ కామెంట్
deepika_ranveer_niharonline

బాలీవుడ్ సినిమా జంట దీపికా పడుకునే, రణవీర్ సింగ్ ల మధ్య ఏదో ఉందని వార్తలు ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. అయినా ఇద్దరిలో ఎవరిని ప్రశ్నించినా... అదేమీ లేదంటూ కొట్టి పారేస్తుంటారు.  వీరి గురించి ఎన్ని వార్తలు రాసినా ఈ జంట మాత్రం పెదవి కదపడం లేదు. ఈ మధ్య రణవీర్ ఓ షూటింగ్ లో గాయపడిన విషయం వార్తల్లో అందరూ చూసే ఉంటారు. ఆ యువ హీరో ‘బాజీరావు మస్తానీ’  షూటింగ్ అప్పుడు గాయపడి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.... ఆస్పత్రిలో జాయిన్ అయిన ఆ హీరోకి తోడుగా దీపిక శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ఉందట. ఆదివారం ఉదయం రణవీర్ డిస్చార్జ్ అయ్యే సమయానికి దీపిక కనపడలేదట. రణవీర్ మాత్రమే అభిమానులకు  అభివాదం చేసుకుంటూ  వెళ్లిపోయాడు. ఇదేంటి అనుకుంటున్న వారికి సమాధానం దొరికింది... దీపిక వెనుక ఆస్పత్రి వెనుక వైపునుంచి జారుకుందట. మళ్ళీ వార్తల్లోకి ఎక్కకూడదని... ఎంత జాగ్రత్త పడితే ఏం లాభం చెప్పండి?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ