కొందరి మేధో శక్తి ఏ పాటితో వారి కథ రాసే విధానం సినిమా టేకింగ్ లో తెలిసి పోతుంది. సినిమాలు ఒక్కోసారి సామాన్య జనాలకు రీచ్ కాకపోయినా వారి సినిమా టేకింగ్ లో ఆ దర్శకుడిని అంచనా వేయొచ్చు. అలా మన తెలుగు సినిమా దర్శకుల్లో తెలివైన దర్శకుడిగా పేరున్న వ్యక్తి దేవా కట్ట. ఈయన మొదటి సినిమా ప్రస్థానంలోనే ఈయన టాలెంట్ అంతా బయటపడింది. అందులో కథ ఆయన సొంతం కావడం విశేషం. ఆయన మొదటి సినిమాకే ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు అందుకున్నాడు. ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి బోలెడు ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలు నిరాశపరిచాయి. ఈ రెండు సినిమాల్లో ఆయన సొంత ఆలోచనలకు తగిన సినిమాలు కాదనిపిస్తుంది. ఆయన్ను అవతలి వారు ఎంచుకున్నారు తప్ప... తన సొంతంగా సినిమాను మలిచింది లేదు. అందుకే సక్సెస్ కాలేదనిపిస్తుంది. అయితే ఆయన మళ్ళీ తన సొంత ఆలోచనలతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు మహాప్రస్థానం అని పేరు పెట్టేశారు. సినిమా విలన్ నేపథ్యంలో సాగే టీజర్ ను విడుదల చేశారు. గతంలో ఆటోనగర్ సూర్య సినిమా రావడానికి ముందు ఆటోనగర్ సూర్య పేరుతో ఓ టీజర్ ను విడుదల చేశారు. అవును.. నేను అనాధను కానీ అనామకుడిని కాదు అన్న డైలాగ్ తో వచ్చిన టీజర్ చాలా పాపులర్ అయింది. అదే తరహాలో మహాప్రస్థానం టీజర్ కూడా విడుదలైంది.
కరెన్సీ.. అన్నింటికి మూలకారణమైన కరెన్సీ వెంట పరిగెత్తాను.. ఏడు సంవత్సరాల వయస్సులో నిజాన్ని తెలుసుకొని.. కరెన్సీ వెంట పరుగెత్తుతున్నానని విలన్ వాయిస్ తో తాజాగా మహాప్రస్థానం టీజర్ విడుదలైంది. ఐ యామ్ కరప్ట్.. క్రిమినల్ .. అండ్ ఐ యామ్ ది విలన్ అంటూ సాగే ఈ టీజర్ కూడా విలన్ ను హైలెట్ చేస్తూ సాగింది. మధ్యలు రెండు డిజాస్టర్లు చవి చూసిన దేవాకట్టాకు ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం.