ఇటీవల 'పిల్లా నువ్వులేని జీవితం' హిట్టుతో జోష్ మీదున్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరో చిత్రానికి సిద్ధమైపోయాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి 'సుబ్రమణ్యం ఫర్ సేల్' అనే టైటిల్ ను అల్రెడీ ఖరారుచేశారు. ఇక ఈ చిత్ర షూటింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమయ్యింది. మరో అతిథి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసారు. వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వి.వి.వినాయక్ ముహుర్తపు షాట్ కు గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముహుర్తపు షాట్ కు క్లాప్ ఇచ్చాడు. ఇది పక్కా మాస్ సినిమా అనీ, హీలేరియస్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందనీ ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు చెప్పారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి షెడ్యూల్స్ ను ఇక్కడ చేసి, ఏప్రిల్ లో అమెరికాలో షూటింగ్ చేస్తామని చెప్పారు. హరీష్ శంకర్ చెబుతూ... "మిరపకాయ్ సినిమా పూర్తయ్యాక ఈ కథ అనుకున్నాను.'రేయ్', 'పిల్లా నువ్వు లేని జీవితం' ప్రోమోస్ చూసి ఈ సినిమాకు ధరమ్ తేజ్ అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా తేజుకి గుర్తుండిపోయే సినిమా అవుతుంది" అన్నారు. దిల్ రాజు, హరీష్ లతో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని హీరో సాయిధరమ్ చెప్పాడు. ఇందులో రెజీనా కథానాయికగా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.