పవన్ ను వదిలి ఎన్టీఆర్ మీద పడ్డాడు

November 27, 2014 | 12:50 PM | 44 Views
ప్రింట్ కామెంట్

రాంగోపాల్ వర్మ... గురుడు ఏం మాట్లాడినా కాంట్రవర్సీటీలు లేకుండా మాట్లాడడు. కానీ, పవన్ అత్తారింటికి చిత్ర సమయంలో మాత్రం పవన్ ను ఓ రేంజ్ లో పొగుడుతూ ట్విట్టర్ లో కామెంట్లు చేశాడు. ఎంతగా అంటే సిగ్గుతో పవర్ స్టార్ మెలికలు తిరిగేంతలా. పవన్ వంతు అయిపోయిందనుకుంటా ఇప్పుడు జూ.ఎన్టీఆర్ మీద పడ్డాడు. లేటేస్ట్ శిష్యుడు పూరి దర్శకత్వంలో జూనియర్ టెంపర్ లో నటిస్తున్నాడు కదా. అందులోని కొన్ని సన్నివేశాలను, పాటలను వర్మ చూశాడట. ఇక ఇంకేం ట్విట్టర్ మీద పడి ఓ రేంజ్ లో కామెంట్లు చేశారు. చిత్రంలో తారక్ అద్భుతంగా నటించాడట. పూరి ఇప్పటి వరకు క్రియేట్ చేసిన క్యారెక్టర్ లో ఇదే ది బెస్ట్ అట. అంతేకాదు జ‘గన్’ నుంచి వదిలిన బుల్లెట్ తారక్ టెంపర్ అంటూ ప్రాసలో ట్విట్ లమీద ట్విట్ లు చేసి పడేశాడు. ఇక సినిమాలో తారక్ నటన చూస్తే పూరి గత హిట్ చిత్రాలైన పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు కూడా ఫ్లాపుల్లా కనిపిస్తున్నాయని తెగ పోగిడేశాడు. ఇవన్నీ చూసి తారక్ తో సినిమా ఆఫర్ కోసమే వర్మ ఇలాంటి కామెంట్లు చేశాడంటే పొరపాటు. కాంట్రవర్సరీతోపాటు అప్పుడప్పుడు క్లారీటీలు కూడా ఇస్తుంటారు కదా. చివర్లో ఇవన్నీ చూసి తారక్ తో నేను సినిమా చేయాలనుకుంటున్నాను అనుకునేరు. తారక్ లోని టెంపర్ ను బయటికి తీసే అంత కెపాసిటీ నాకు లేదు అంటూ ముగించేశాడు. అయినా ఓ భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న జూనియర్ మీతో ఎందుకు సినిమా తీస్తాడండి బాబూ!.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ