మన తెలుగు సినిమాల్లో అయితే హీరోయిన్లకు పెళ్ళయ్యిందంటే ఇక అంతే సంగతులు, ఆమెకు ఆఫర్లు తగ్గిపోతాయి. బాలీవుడ్ లో అలా కాదు. పెళ్ళయి బిడ్డతల్లయిన ఐశ్వర్యకూ, పెళ్ళయిన కరీనాకూ ఇంకా ఆఫర్లు ఏ మాత్రం తగ్గలేదట. చేసింది తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మంచి పేరే సంపాదించాడు. అయితే పెళ్లి కానీ ఈ అందగాడికి కరీనాతో చేయాలనే కోరిక పుట్టింది. ఈమెతో నటించేందుకు చాలామంది యంగ్ హీరోలు పోటీపడుతున్నారు. తాజాగా కరీనాకపూర్‌తో సినిమా చేయాలని వుందని, ఆమె ఓకే అంటే తాను నటిస్తున్న ‘బద్లాపూర్’లో స్పెషల్ రోల్ వుందంటూ హీరో వరుణ్ ధావన్ మీడియా ముందు చెప్పాడు. ఈ విషయం కరీనాకు తెలిసి, ఆమె ఏం చెపుతుందా అని ఎదురు చూశారు అభిమానులు. అయితే, సమయం కోసం వేచి చూసి, రిప్లై ఇచ్చేసింది కరీనా. వరుణ్‌తో కావాలంటే డిన్నర్‌కు వెళ్తానని, సినిమా మాత్రం చేయనని నవ్వుతూనే తిరస్కరించింది. ఎందుకు అలా చేసిందో అర్థం కాక బాలీవుడ్ లో ఇదో చర్చనీయాంశమైంది. కరీనా కంటే వరుణ్ చిన్నవాడు, మరి తన స్థాయికి అందడనుకుందో, మరే కారణం చేతనో తనతో చేయడానికి నో చెప్పేసింది ఈ భామ.