ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు అవుతున్నా స్టార్ హీరోల కేటగిరీలో ప్రభాస్ చేరి రెండేళ్లే అవుతుంది. వరుసగా సినిమాలు ఫ్లాపు అవుతున్నప్పటికీ యూత్ లో అతని క్రేజే ఇప్పుడు ఈ స్థాయికి చేరుకునేలా చేసింది. ఇక రాజమౌళి బాహుబలి తీయటం ఏమోగానీ ఈ యంగ్ రెబల్ స్టార్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆరడుల ఈ ఆజానుబాహుడికి దేశమొత్తం పిచ్చ పిచ్చగా క్రేజ్ లభించేసింది. దీంతో ప్రభాస్ కి నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చి చేరింది.
ఇక ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్న యాడ్ సంస్థలు కూడా ప్రభాస్ తో ఒప్పందాల కోసం క్యూ కట్టేస్తున్నాయి. ఈ మధ్య మహీంద్రా యాడ్ లో సందడి చేసిన డార్లింగ్ ఇప్పుడు మరో బంపరాఫర్ కొట్టేసినట్లు సమాచారం. ప్రఖ్యాత డ్రింక్స్ సంస్థ పెప్సీ యాడ్ లో నటించే చాన్స్. అది కూడా ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో. త్వరలో దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్ ను జరపునున్నట్లు తెలుస్తోంది. గతంలో మగధీర తర్వాత రాంచరణ్ తో కూడా ధోనీ ఇలాగే పెప్సీ యాడ్ లో కనువిందు చేశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా సేమ్ రాజమౌళి సినిమా తర్వాతనే ధోనీతో యాడ్ చేస్తున్నాడు. ఇక తాజా యాడ్ కి దర్శకత్వం వహించాల్సిందిగా రాజమౌళిని పెప్సీ కంపెనీ కొరిందట. ఒకవేళ జక్కన్న దానికి ఓకే చెబితే... పెద్దది... ఇంకా పెద్దది.. అంటూ ఓ యాడ్ వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.