నితిన్ ఇంట్లోకి దూకి వీరాభిమాని వీరంగం

January 17, 2015 | 12:08 PM | 62 Views
ప్రింట్ కామెంట్

యువ హీరో నితిన్ పై వెర్రి వ్యామోహం పెంచుకున్న ఓ యువతి ఉదంతం హైదరాబాద్ లో కలకలం సృష్టించింది. శనివారం ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనతో పోలీసు అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. ట్విస్ట్ ఏంటంటే... ఆ యువతి ఓ పోలీసు అధికారి కూతురట. వివరాల్లోకి వెళ్లితే... శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని యువహీరో నితిన్ ఇంటి వద్దకు ఓ యువతి చేరుకుంది. సెక్యూరిటీ గార్డు కళ్లుగప్పి ప్రహారీ గోడ దూకి నితిన్ ఇంట్లోకి ప్రవేశించింది. అంతేకాదు ఎంచక్కగా కారిడార్ లో నిద్రపోయింది. తెల్లవారు ఝూమున నితిన్ తల్లి ఆ యువతిని గుర్తించి ఎవరని ప్రశ్నించగా, తాను నితిన్ అభిమానిని అని, అతనిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లిచేసుకుంటానని చెప్పిందట. దీంతో కంగుతిన్న ఆమె పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు యువతి అనంతపురంకు చెందిన ఓ పోలీసు అధికారి కూతురని తెలిసి అవాక్కయ్యారంట. అనంతరం యువతికి కౌన్సిలింగ్ నిర్వహించి ఆమె ఇంటివద్ద దిగబెట్టారు పోలీసులు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ