సన్నని నడుముతో, సొంపైన వంపులతో... ఇక రంగు చెప్పక్కర్లేదు కదా... టోటల్ గా చక్కని చుక్కలా ఉండే తమన్నా... ఇంత బొద్దుగా కనిపిస్తే అభిమానులు హర్టయి పోరూ... బాడీమీద కాసింతయినా శ్రద్ధలేకుండా ఫ్యాటును ఇలా పెంచేసింది తమన్నా. బాహుబలి సినిమా షూటింగ్ లో రాజమౌళి గారు బాగా ఎక్సర్సైజ్ చేయించినట్టున్నారు, రాజకుమారి పాత్రలో ఓ మెరుపు తీగలా కనిపించింది. ఆ సినిమాలో కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు తెగ చేసేసిందట. మరి ఇవన్నీ చేయాలంటే శిక్షణ తీసుకోవాలి. ఇది బాడీకి ఎక్సర్సైజే కదా. అయితే ఆ షూటింగ్ ముగించుకుని మళ్ళీ ఓ తమిళ సినిమాలో సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్త విరామం దొరికిందట ఈ అమ్మడికి. ఈ సమయంలో షికార్లు, పార్టీలు, ఎంజాయ్ మెంట్లు మస్తుగ చేసినట్టుంది. బాడీ గురించి పట్టించుకోలేదు. ఇదిగో ఇలా లావెక్కిపోయింది. మామూలు డ్రెస్సులో అయితే పెరిగిన ఫ్యాట్ కనిపించేది కాదేమో... టైట్ ఫిట్టింగ్ లో పెరిగిన కండలన్నీ బయట పడ్డాయి. ఇంతలా లావెక్కితే మళ్ళీ సినిమా ఛాన్సులు ఎలా వస్తాయి తమన్నకు. ఈ కండలు ఇలా కంటిన్యూ చేస్తే... ఈ ఫీల్డులో కష్టం తల్లీ... వెంటనే కండలు కరిగించే కసరత్తు మొదలు పెట్టేయ్...