ఓ చిన్నడిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ నిర్మాతగా ఇఫ్పుడు సొంతంగా చిత్రాలు నిర్మించే రేంజ్ కి ఎదిగాడు. టాలీవుడ్ లో ఆ నలుగురి హవాను తట్టుకుని నిలదొక్కుకుని ఇప్పుడు ఊహించని లాభాలు అర్జిస్తున్నాడు దిల్ రాజు. తన నిర్మాణ సారథ్యంలో ఫ్యామిలీ చిత్రాలను తెరకెక్కిస్తూ మరో వైపు చిన్న పెద్దా తేడా లేకుండా నైజాంలో అన్ని చిత్రాలను కొనుగోలు చేస్తూ భారీగా లాభపడ్డాడు. ఒకవేళ పెద్ద చిత్రం హిట్ ఫ్లాప్ అయినా, చిన్న చిత్రాల హిట్లతో వాటిని కవర్ చేస్తున్నాడు. ఉదాహరణకు కిక్ 2 డిజాస్టర్ అయితే భలే భలే మగాడివోయ్, కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మావలు రాజుగారి జేబును ఫుల్ గా నింపాయి. కథలో కొత్తదనం ఎంతవరకూ వుంది ముఖ్యంగా యూత్ ని అది ఏ స్థాయిలో ఆకట్టుకునే అవకాశం ఉంది అనే అంశాల ఆధారంగానే దిల్ రాజు చిత్రాలు నిర్మించటం కానీ, బయటి చిత్రాలు కొనుగోలు చేయటం కానీ చేస్తుంటాడు. అంతేకాదు కథ బాగా నచ్చితే దాని నిర్మాణంలో భాగస్వామి అవుతాడు. దీంతో ఆయన ఒక సినిమాకి నిర్మాతగానే కాదు, నిర్మాణ భాగస్వామిగా కూడా సక్సెస్ అవుతుంటాడు.
ఇక కొత్త సినిమా అయినప్పటికీ రాజు నిర్మాత కావటంతో హైప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలా ఇప్పుడు తాజాగా మరో చిత్ర నిర్మాణంలో సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు దిల్ రాజు. చంద్రశేఖర్ యేలేటి శిష్యుడు మురళీకృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తేజస్విని, చేతన్, కృతిక తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుందట దీంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని భావించిన రాజు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాడని తెలుస్తోంది. అనామక సినిమాలకు అవసరం లేకుండా ఫ్రీ ప్రచారం చేసేస్తున్నాడు రాజు. తద్వారా లాభాలు బాగానే వెనకేసుకుంటున్నాడు లేండి. అన్నట్లు ఈ చిత్రానికి నిర్మాత మారుతి కావటం మరో విశేషం.