శృతీహాసన్ పెద్ద తప్పు చేస్తుంది

December 05, 2015 | 11:47 AM | 6 Views
ప్రింట్ కామెంట్
Shruti-Haasan-no-to-small-heros-niharonline

సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ చిన్న హీరోయిన్ లే. వరుస హిట్లతో వారు స్టార్ డమ్ ను అందుకుని రానురాను అగ్ర కథానాయికలు అయిపోతారు. కానీ, శృతీహాసన్ పరిస్థితి అలా కాదు. ఆమె రావటమే తండ్రి కమల్ హాసన్ కూతురిగా, మెల్లిగా ఓ టాలెంట్ ఉన్న నటిగా వచ్చింది. ప్రారంభంలో చాలా ఎదురుదెబ్బలే తగిలాయి. నేరుగా బాలీవుడ్ డెబ్యూ చేసిన ఫలితం శూన్యం. ఆపై వరుస ఫ్లాపులు ఆమెను తట్టాయి. అయినా అందివచ్చిన అవకాశాలతో పెద్ద స్టార్ గా ఎదిగిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా శ్రుతిహాసన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో కూడా అడపా దడపా చిత్రాలు చేస్తూ అక్కడి జనాల నోళ్లలో కూడా నానుతుంది. అయితే అక్కడే ఆమె పప్పులో కాలేస్తుంది. కేవలం అగ్రకథానాయకుల సరసన నటించడానికే ఆమె ఎక్కువగా ఆసక్తిని చూపుతోందట. రెండవ వరుసలోని కథానాయకులతో సినిమాలను తెరకెక్కించే కొంతమంది దర్శక నిర్మాతలు, ఆమెని సంప్రదించడం వలన ప్రయోజనం వుండటం లేదట. చిన్న కథానాయకుల కాంబినేషన్లో చేయనని మొహమాటం లేకుండా చెప్పేస్తుందని అంటున్నారు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామని చెప్పినా, ఆమె ససేమిరా అంటోందని చెబుతున్నారు. అందరిలాగానే శ్రుతిహాసన్ తన స్థాయిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందనీ .. అందులో తప్పేముందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తుంటే, చిన్న చితకా హీరోలతో కూడా చేయటం వల్ల ఆమె మరిన్నీ హిట్లు అందుకునే అవకాశం మిస్సవుతుందేమోనని మరో వర్గం అంటోంది.  స్టార్ హీరోయిన్లుగా మారిన తర్వాత కూడా నయనతార లాంటి వాళ్లు చిన్న హీరోలతో చేసి హిట్లు అందుకుంటున్నారు కదా అని వారు చెబుతున్నారు. మరి ఇది శృతి చెవిన పడుతుందంటారా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ