సిద్ధార్థ దిల్ మెచ్చిన టైటిల్

March 26, 2015 | 12:35 PM | 35 Views
ప్రింట్ కామెంట్
dilraj_movie_poster_niharonline

ఇటీవల సిద్ధార్థ సినిమాలు తెలుగులో పూర్తిగా తగ్గిపోయాయి. వరుసగా ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో తెలుగు వైపు చూడ్డం మానేశారు. సిద్దార్ద హీరోగా తమిళంలో రూపొందిన జిగరతాండ చిత్రాన్ని తెలుగులో ఆయన అభిమాన నిర్మాత దిల్ రాజు పేరును టైటిల్ గా పెట్టుకున్నారు. ఈ సినిమా ఇప్పుడు డబ్బింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. సిద్దార్ద హీరోగా పిజ్జా దర్శకుడు రూపొందించి తమిళంలో హిట్టైన 'జిగర్‌తండా' చిత్రానికి తెలుగు టైటిల్ గా 'చిక్కడు దొరకడు' ని ఖరారు చేస్తూ ఆ మధ్యన పోస్టర్ విడుదల చేసారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడేవారే కరువు అయ్యారు. దాంతో చిత్రం బిజినెస్ జరగకపోవటంతో మూలన పెట్టేసారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని మళ్లీ దుమ్ముదులిపి, టైటిల్ మార్చి... దిల్ రాజు అని పెట్టారు. అలాగే...దమ్ముంటే కాస్కో అనే ట్యాగ్ లైన్ తో విడుదల చేస్తున్నారు. దిల్ రాజు అనే టైటిల్ పెట్టడంతో ఒక్కసారిగా అందరి దృష్టీ ఈ చిత్రంపై పడింది. తమ పేరును ఉపయోగించుకోవద్దంటూ కొందరు స్టార్లుగగ్గోలు పెడుతుంటే ఇటీవల విద్యాబాలన్ మాత్రం తన పేరు ఉపయోగించుకున్నందుకు సంతోషపడిపోయిందట. మరి దిల్ రాజు ఈ టైటిల్ పై ఎలా స్పందించాడో?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ