వాలెంటైన్స్ డే సందర్భంగా తన సమయాన్నంతా తన తల్లితోనూ, సోదరి మాలవియ తోనూ గడిపేసాడట రానా దగ్గుబాటి. ఈ ఆజానుబాహుడు తన జీవితంలో ముఖ్యమైన ఈ ఇరువురితో కలిసి ఎన్టీఆర్ టెంపర్ సినిమా చూశాడట. ‘నా ప్రేమికుల రోజును నేను మా అమ్మ, చెల్లితో కలిసి టెంపర్ సినిమా చూశాను’ అంటూ సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేశాడు. చూశారుగా... ఈ ముగ్గురూ ఎంత ఆనందంగా కెమెరాకు పోజిచ్చారో...? ఈ ప్రత్యేకమైన రోజును ఇలా గడపడం వంటి చిన్న చిన్న ఆనందాలే జీవితాంతం గుర్తిండిపోతాయి.