కిలికి భాష రైటర్ ను లాక్కున్న శంకర్

September 29, 2015 | 05:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
director_shenkar_writer_madan_karke_niharonline

‘బాహుబలి’ సినిమా విజయం ఆ చిత్రంతో పని చేసిన ప్రతి ఒక్కరిదీ అవుతుందని జక్కన్న ఇంతకుముందు పలు మార్లు చెప్పారు. అయితే ఈ విజయం వెనుక ఉన్న క్రియేటివ్ హెడ్స్ పైన స్టార్ డైరెక్టర్ల దృష్టి తప్పని సరిగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఆసాంతం పరిశీలించి ఏ క్వాలిటీలో ఏ హెడ్ క్రియేషన్ ఎంత ఉందో క్యాచ్ చేసే పనిలో స్టార్ డైరెక్టర్లు చాలా షార్పుగా ఉంటారు. ఇప్పుడు ఆ పనిలో తమిళ డైరెక్టర్  శంకర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైంది మొదలు... దీనికంటే అద్భుతంగా చిత్రం చేయాలనే ఆరాటం ఆయనలో కనిపిస్తోంది. ఆయన సినిమా ‘రోబో’తో ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఆయనకు సాటి మరో డైరెక్టర్ లేడని అనిపించుకున్నాడు. కానీ రాజమౌళి ‘బాహుబలి’తో శంకర్ ను సవాల్ చేసినట్టయ్యింది. రోబో సినిమాకు సీక్వెల్ తీయాలనుకున్నప్పుడు మొదటి భాగాన్ని మించేలా రెండో భాగం తీయాలనుకున్నాడు.  కానీ ‘బాహుబలి’ విడుదల తర్వాత ఆయన టార్గెట్ మారిపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన దృష్టంతా బాహుబలి మీదే ఉన్నట్టు కనిపిస్తోంది. 
ఈ నేపథ్యంలోనే బాహుబలి టెక్నీషియన్లను ఆయన తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాహుబలికి అద్భుతమైన ఎఫెక్ట్స్ సమకూర్చిన వీఎఫ్ ఎక్స్ నిపుణుడు శ్రీనివాస్ మోహన్ ‘రోబో-2’కు పనిచేయబోతున్నాడు. ఐతే శ్రీనివాస్ ఈ స్థాయికి రావడానికి కారకుడు శంకరే. శ్రీనివాస్ అంతకుముందు ‘రోబో’కు పని చేశాడు.  ఇది ఆశ్చర్య పడవలసిన విషయం కాదు. కానీ తమిళ వెర్షన్ కు మాటలు, పాటలు రాసి గొప్ప పేరు తెచ్చుకున్న మదన్ కార్కీని శంకర్ తన టీంలోకి తీసుకోవడంపై ఇండస్ట్రీలో పెద్ద టాక్ అయ్యింది. మదన్ ఇంతకుముందు చిన్న సినిమాలకే పని చేశాడు. బాహుబలి మదన్ కార్కీని శంకర్ దగ్గర పని చేసే అవకాశం కల్పించినట్టయ్యింది. ఇప్పటికే జయమోహన్ తో కలిసి పూర్తి చేసిన స్క్రీప్టును ఇప్పుడు మదన్ తో కలిసి మెరుగులు దిద్దే పనిలో శంకర్ ఉన్నట్టు తెలుస్తోంది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ