వినాయక్ కి ఆ రుచి తగలాల్సిందే!

March 02, 2016 | 12:18 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Director-V-V-Vinayak-production-house-launch-soon-niharonline

తెలుగులో టాప్ దర్శకుడిగా వినాయక్ కి ఎంతో క్రేజ్ వుంది. మాస్ ఆడియన్స్ పల్స్ ను పట్టుకుని వారి టేస్ట్ కు తగ్గట్టుగా చిత్రాలను అందించటంలో మంచి పేరుంది. సాధారణ ప్రేక్షకుడికి కావలసిన వినోదాన్ని ఓ మాస్ సబ్జెక్టులో అందించటం ఆయనకు కొట్టిన పిండి. చిరు లాంటి సీనియర్ హీరోతో ఠాగూర్ లాంటి మెసేజ్ ఓరియెంటల్ చిత్రం తీసినా, కొత్త హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు శీను వంటి ఎంటర్ టైన్ చిత్రాన్ని అందించినా బహుశా వినాయక్ కే చెల్లుతుందేమో. కథలో ఏయే అంశాలు ఏ పాళ్లలో వుండాలనేది ఆయనకి బాగా తెలుసని రాజమౌళి లాంటి టాప్ డైరక్టర్ సైతం వినాయక్ గురించి పొగుడుతుంటారు. అయితే అఖిల్ తో ఢీలా పడ్డ ఈ స్టార్ డైరక్టర్ ఇప్పుడు ఎలాగైనా మళ్లీ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఏ దర్శకుడు చేయని రీతిలో ఆ చిత్రం కోసం రెమ్యునరేషన్ ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు వినాయక్.

ప్రస్తుతం చిరు 150వ చిత్రం కోసం కసరత్తు చేస్తున్న వినాయక్ త్వరలో నిర్మాతగా మారనున్నాడంట.  సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసుకుని, ఆ బ్యానర్ పై చిన్న సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నాడట.

తెలుగు చిత్రపరిశ్రమలో ఈ మధ్య దర్శకులు నిర్మాతలుగా మారుతుండటం తెలిసిందే. హరీష్ శంకర్, మారుతి, సుకుమార్ లాంటి దర్శకులు ఇండియన్ రూపాయిలతోపాటు, డిస్ట్రిబ్యూటర్ లుగా విదేశాల్లో డాలర్ల రుచి కూడా మరుగుతున్నారు. అయితే అఖిల్ లాస్ ను పూడ్చటానికి ఇంటిని సైతం అమ్ముకున్నాడంటూ వార్తలు వస్తున్న క్రమంలో వినాయక్ నిర్మాతగా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కొరుకుందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ