షారూఖ్ బద్ధ శత్రువు ఎవరో తెలిసిపోయింది

March 01, 2016 | 03:02 PM | 3 Views
ప్రింట్ కామెంట్
srk-fan-2-trailer-out-niharonline

తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ బాద్ షా కు శత్రువా? అవును షారూక్ ఖాన్ ఉన్న ఏకైక బద్ధశత్రువు ఎవరో తెలిసిపోయింది. ఆయన వీరాభిమానే బద్ధ శత్రువుగా మారి ఆయనని చంపాలని చూస్తున్నాడంట. అంతా చూసి నిజం అనుకోకండి సుమా. ఆయన తాజా చిత్రం 'ఫ్యాన్' సినిమాకి సంబంధించి ఇదంతా. కొన్ని నెలల క్రితం మొదటి ట్రైలర్ రిలీజ్ కాగా, ఇప్పుడు తాజాగా రెండో అఫీషియల్ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. సోమవారం ఈ ట్రైలర్ ను విడుదల చేయగా, ఒక్కరోజులో దాదాపు 11.5 లక్షల మంది దీన్ని వీక్షించారు.

తొలి ట్రైలర్ లోనే ఈ చిత్రంలో షారూక్, ఓ బాలీవుడ్ స్టార్ ఆర్యన్ ఖన్నాగా, ఆయన్ను విపరీతంగా అభిమానించే ఫ్యాన్ గౌరవ్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న సంగతి బయటకు రాగా, రెండో ట్రైయిలర్ లో సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది. ఆ విలన్ కూడా ఎవరో కాదు. షారూకే... తన అభిమాన నటుడిని కలవాలన్న గౌరవ్ ప్రయత్నాలు, ఆపై ఇద్దరి మధ్యా విభేదాలు, వారిద్దరి పోరాటాలను ఈ ట్రైలర్ లో టేస్ట్ చూపించారు. ఇక గౌరవ్ పాలిట ఆర్యన్ విలనా? లేక ఆర్యన్ పాలిట గౌరవ్ విలన్ గా మారాడా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ