చిరంజీవి 150వ చిత్రం కోసం సర్వత్రా చర్చలు నడుస్తున్నట్టుగానే ఓ కొత్త విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాకు హీరోయిన్ ఖరారైనట్లు సినీ పరిశ్రమలో ఓ సరి కొత్త వార్త గుప్పుమంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రోడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్టు ప్రచారం కూడా జరుగుతోంది. మెగా ఫ్యాన్స్ కి చిరంజీవి శంకర్ దాదా టైపులో హాస్యం అందిస్తాడా? లేక స్టాలిన్ టైప్ లో ప్రజా సేవకుడిలా కనిపిస్తాడా అని తర్జనబర్జనలు జరుగుతున్నాయి. ఆయన సినిమాకు ముహూర్తం ఎప్పుడో గానీ, చర్చలతో మాత్రం చాలా మంది కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు ఈ మెగాస్టార్ తో జోడీ కట్టబోయే హీరోయిన్ గురించి ఓ సీక్రెట్ బయటికి వచ్చేసరికి అభిమానులు ఆనందంతో గంతులేస్తున్నారు. ఈ సినిమాకు మొన్నటి వరకు కొత్త హిరోయిన్ను తీసుకొవాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఓల్డ్ బ్యూటీ శ్రీదేవి, చిరంజీవి సరసన నటించే అవకాశం ఉందని అంటున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాల్లో ఒకటి బ్లాక్ బస్టర్. మళ్ళీ అదే కాంబినేషన్‌ను రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీదేవితో చర్చలు జరిగినట్టు అగ్రీమెంట్ కూడా పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై నిజాలు బయట పెట్టాల్సింది ఈ చిత్రం తీస్తున్న వారు మాత్రమే. ఆ శుభ వార్త కోసం అందరం వెయిట్ చేద్దాం...