మంచి టేస్టున్న డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఆయన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నాడు. అలాంటి మంచి టేస్ట్ ఉన్న నటుడే నారా రోహిత్. మరి వీరిద్దరూ కలిస్తే... ‘జ్యో అచ్చుతానంద’ అంట... ఇది టైటిల్... చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా... అవసరాల ఆలోచనలే అలా ఉంటాయి మరి. అందుకే నారా రోహిత్ ఓకే చేశాడీ సినిమాకు. ఆయనకూ వైవిధ్యమే కావాలిగా. వారాహి చలనచిత్రం బేనర్ లో ఈ చిత్రం రెడీ అవుతుంది. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా ఆరంభమైంది. జ్యోతి - అచ్యుతరావు - ఆనందరావు అనే ముగ్గురు వ్యక్తుల చుట్టూ సాగే కథ అంటున్నారు. ఓ హీరోయిన్ - ఇద్దరు హీరోలన్నమాట. టైటిల్ తోనే సగం మార్కులు కొట్టేసిన అవసరాల ఓ క్యారెక్టరుకు నారా రోహిత్ ను ఎంచుకున్నాడు. మిగతా ఇద్దరి సంగతి ఇంకా తేల్చలేదు. ఐతే రెండో హీరో పాత్రకు శర్వానంద్ ను అనుకుంటున్నట్టు సమాచారం. ఇంకా హీరోయిన్ ను కూడా తేల్చాల్సి ఉంది.