గుణ శేఖర్ 12 సంవత్సరాలుగా కలలు గన్న హిస్టారికల్ మూవీ రుద్రమదేవి. అది ఇన్నాళ్ళకు తెరపైకి రాబోతోంది. ఈ సినిమాను ఆయన తెరమీదకు తీసుకువచ్చేందకు ఎంత కష్టపడ్డారో సినీ అభిమానులు ప్రతి ఒక్కరూ గమనించిన అంశం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదాలు పడుతూ చివరికి అక్టోబర్ 9కి విడుదలకు ముహూర్తం కుదిరింది. ఒక దర్శకుడే నిర్మాతగా మారి ఇంతటి భారీ బడ్జెట్ సినిమా (దాదాపు 70 కోట్లు) చేయడానికి పూనుకున్నాడంటే ఆయనకు ఈ సినిమా తీయాలనే కోరిక ఎంత బలమైనదో అర్థ మవుతుంది. ఇండస్ట్రీ మొత్తం ఇదే ప్రశ్న ఆయన ఇంత డబ్బు ఎక్కడినుంచి తెస్తున్నాడని... ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సమాధానం ఊహించేసుకున్నారు. కానీ ఈ ప్రశ్నకు సమాధానంగా నిన్న జరిగిన (4 అక్టోబర్) ప్రెస్ మీట్ లో గుణశేఖర్ ఈ విధంగా చెప్పుకొచ్చారు. ‘‘నాకు గుప్తనిధులు దొరికాయని వాటితోనే సినిమా తీశానని...
ఆ దొరికిన గుప్తనిధి ధనం రూపంలో కాదు... రుద్రమదేవి కథ రూపంలో.... అందుకే ఎన్ని కష్టాలైనా ఈ సినిమా చేశా. అంతే తప్ప నేను గ్రాఫిక్స్ కోసమో - విజువల్ ఎఫెక్ట్స్ కోసమో ఈ సినిమా తీయలేదు’’ అన్నాడట. ఎన్నో సార్లు విడుదల డేట్లు ప్రకటించి మళ్ళీ వాయిదా వేస్తూ వస్తుండడంతో ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకొన్న సమయానికి అనుకొన్నట్టుగానే వస్తుందని టుడీతో పాటు త్రీడీలోనూ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని స్పష్టం చేశాడు. పదిహేను రోజులుగా చిత్రబృందం నిద్రాహారాలు మాని కష్టపడిందనీ దాంతో త్రీడీ పనులు పూర్తయ్యాయని త్రీడీ వెర్షన్ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుందని చెప్పుకొచ్చాడు. రుద్రమదేవి కి రెండు సార్లు సెన్సార్ జరిగిందన్న వార్తలను కూడా గుణ ఖండించారు. ఒక్కసారే సెన్సార్ జరిగిందని తొలిసారి ట్రైలర్ కోసం సెన్సార్ జరిపామని ఆయన స్పష్టం చేశాడు.
అయితే సెన్సార్ వాళ్ళు కూడా లాస్ట్ 30 నిమిసాలు చాలా బాగుందని చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాక హిందీ వర్షన్ లో విడుదల చేసిన ట్రైలర్ కు కూడా విపరీతమైన స్పందన వచ్చింది. ఇది బాహుబలికి ఏ మాత్రం తీసిపోని విజువల్ ఎఫెక్ట్స్ తో ఉందన్న టాక్ వినిపిస్తోంది.