ఇదిగిదిగో ఇతగాడే చిన్న రాజమౌళి

November 24, 2015 | 11:30 AM | 5 Views
ప్రింట్ కామెంట్
maruthi-junior-rajamouli-of-tollywood-niharonline

రాజమౌళి కెరీర్ ప్రారంభంలో ఎలాంటి ఒడిదుడుకులు లేవు. గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఆశీస్సులతోపాటు ఆయన అండదండలు ఉన్నందునే ఆయన కెరీర్ ఎలాంటి ఢోకా లేకుండా ముందుకు సాగిపోతు వస్తుంది. అయితే ఎంత స్టార్ డైరక్టర్ అయినా ఆ పేరును నిలబెట్టుకుంటూ నిర్మాతలకు నష్టం చేయకుండా ముందుకు సాగటం కష్టమే. కానీ, రాజమౌళి ఆ ఫీట్ ను సాధ్యం చేసి చూపాడు. ఆ విషయంలో రాజన్నను కొట్టేవారే లేరన్నది ఒప్పుకోవాల్సిన నిజం. ఇక ఇప్పుడు మరో డైరక్టర్ రాజమౌళిని అనుకరిస్తూ కెరీర్ ను ముందుకు సాగినట్లు కనిపిస్తోంది.

ఓ చిన్న చిత్రాల దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించి ముందుకు సాగుతున్నాడు దర్శకుడు మారుతి. 2012లో ఈ రోజుల్లో అనే ఓ చిన్న చిత్రంతో బ్లాక్ బస్టర్ ను సాధించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ఆ తర్వాత బస్ స్టాప్ వంటి యూత్ ఎంటర్ టైనర్ ను తీసి యూత్ లో క్రేజ్ సంపాదించేసుకున్నాడు. అదే టైంలో ఇతగాడికి బూతు డైరక్టర్ అన్న ట్యాగ్ లైన్ వచ్చి పడింది. ఆ తర్వాత వచ్చిన ఒకటి రెండు సినిమాల్లో (నిర్మాణ సారథ్యంలో )ఇలాంటి పంథానే కొనసాగటంతో ఇక ఇతగాడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైనట్లే అని అంతా అనుకున్నారు. కానీ అదంతా పటాఫంచల్ చేసేశాడు మారుతి.

భలే భలే మగాడివోయ్ చిత్రంతో క్లీన్ యూ దర్శకుడిగా ముద్రపడిపోయాడు. ఇప్పటిదాకా చేసిన చిత్రాలు ఒక ఎత్తు అయితే ఈ చిత్రం ఒక ఎత్తు అయ్యింది. స్టార్ హీరోలతో ఛాన్స్ చేసేందుకు లైన్ క్లియర్ ఇచ్చింది. సినిమా కోసం కష్టపడుతాడు అన్న పేరు మూలంగానే మారుతి కెరీర్ ఇప్పుడు అగ్రపథంలో దూసుకెళ్తుందని చెప్పొచ్చు. అతిథిగా వెళ్లిన ప్రతీ ఆడియో పంక్షన్లలో కూడా మారుతి పేరును ప్రతీ ఒక్కరు ప్రస్తావించటమే దీనికి నిదర్శనం. అందుకే వెంకటేష్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్లు మారుతి పై ఇప్పుడు ఆసక్తి పెంచుకుంటున్నారు. రాజమౌళితో పోలిస్తే ఒక్క సక్సెస్ విషయంలో అప్ డౌన్ తప్పా, మిగతాదంతా సేమ్ టూ సేమ్ అంటున్నారు సినీ పెద్దలు. మరీ జూనియర్ రాజమౌళి కెరీర్ కూడా జక్కన్న కెరీర్ లాగానే సక్సెస్ ఫుల్ గా సాగాలని కొరుకుంటూ ఆల్ ది బెస్ట్ టూ మారుతి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ