ఒక వైపున తెలుగులోనూ, మరో వైపున తమిళ్లోను అగ్రకథానాయకుల సరసన అవకాశాలను అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది సమంత. తమిళ్లో ఇటీవలే విక్రమ్ తో చేసిన 10 ఎంద్రాకుల్లమ్ ఇలా వచ్చి అలా పోగా ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ కెరీర్ పై పడకుండా జాగ్రత్త పడుతోంది. తెలుగులో అ... ఆ..., బ్రహోత్సవంతోపాటు, తమిళ్ లో ధనుష్ సరసన వీఐపీ-2 లో నటిస్తున్న ఈ చెన్నై సోయగం ఇప్పుడు మరో మంచి ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా విజయ్ తో మరోసారి జత కట్టే ఛాన్స్ ని కొట్టేసింది. అయితే ఇన్నాళ్లు గ్లామర్ రసాన్ని ఒలకబోసిన ఈ అమ్మడు దానికి కంప్లీట్ గా గుడ్ బై చెబుతుందా అని ఇప్పుడు టాక్. సినిమాలతోపాటు, పరిణితి ఉన్న క్యారెక్టర్లను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రాజా రాణి తో మంచి హిట్ సాధించిన అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు ఇదయదళపతి విజయ్ సిద్ధమైపోతున్నాడు. ఈ సినిమా లో కథానాయికగా సమంతను తీసుకున్నారు. ఈ సినిమాలో సమంతా ఒక బిడ్డకు తల్లిగా కనిపించనుందనే వార్త ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బిడ్డతోను, భర్తతోను సమంతా ఆనందంగా గడిపే క్షణాలపై ఒక పాట కూడా ఉంటుందని వినికిడి. ఈ సినిమాలో సమంతా కూతురుగా, నటి మీనా కూతురు 'నైనిక' తొలిసారిగా వెండితెరపై కనిపించనుంది. మరోవైపు వీఐపీ-2లో కూడా ధనుష్ భార్యగా ఓ బిడ్డకు తల్లిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ధనుష్ తోనే వడ చిత్రంలో మురికివాడలో జీవించే అమ్మాయిగా కనిపించనుందట. మొత్తానికి కెరీర్ ను నెట్టుకు రావాలనే తాపత్రయంలో ఇలా డీగ్లామర్ రోల్స్ చేసుకుంటూ పోతే అభిమానులు ఏమైపోతారో కాస్త ఆలోచించు! తమిళ్ లో చేస్తే చేశావ్ గానీ, తెలుగు లో మాత్రం వద్దు అని అభిమానులు వేడుకుంటున్నారట.