చిన్న సినిమాలకు దర్శకత్వం వహించిన సీహెచ్.శ్రీనివాస్ ఆదివారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించగా పక్కనే ఉన్న స్నేహితుడు ఈ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. ఆలీ హీరోగా నటించిన ‘సర్కస్ సత్తిపండు’ సినిమాకు, సామ్రాట్ హీరోగా 'సమ్‌థింగ్ స్పెషల్' అనే మరో సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ నమిత కన్ స్ట్రక్షన్స్ కు ఓనర్ కూడా. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్లలో బిల్డర్‌గా సెటిలయ్యారు. ఆదివారం బెంగళూర్ నుండి స్నేహితుడు ఉదయ్‌తో బిఎండబ్ల్యూ కారులో కలిసి వస్తూ ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీనివాస్ భార్య, కుమార్తెలతో హైదరాబాద్ లోని పంజాగుట్టలో నివాసం ఉంటున్నాడు.