దర్శకుడు తేజ తెలంగాణ ’హోరాహోరీ’

April 16, 2015 | 02:16 PM | 55 Views
ప్రింట్ కామెంట్
Director_Teja_horahori_niharonline

‘చిత్రం’తో విచిత్రంగా చిత్రసీమలో వెలిగిపోయిన డైరెక్టర్ తేజ. అప్పటి వరకూ ఆయనకు సినిమాతోనే అనుబంధం ఉన్నప్పటికీ, వెలుగు చూడని ఓ టాలెంట్ మేన్ గా ఉండిపోయారు. తెలుగు సినిమాలో లో బడ్జెట్‌తో ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధించిన ఫిలిం మేకర్‌గా ఆయనకు మంచి పేరుంది. ఇప్పుడాయన చేస్తున్న మరో కొత్త ప్రయోగం 'హోరాహోరి'. తెలుగు సినీపరిశ్రమలో తెలంగాణకు చెందిన సినీ నిపుణులకు, కళాకారులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే ఆరోపణ నేపథ్యంలో, ఆయన కొత్తగా తీస్తున్న ఈ సినిమాకు తెలంగాణ ఆర్టిస్టులను తీసుకున్నానని చెబుతున్నాడు. సినిమాటో గ్రాఫర్, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, మ్యూజిక్ కంపోజర్, ఆర్ట్ డైరెక్టర్, మేకప్ మెన్, లైట్ మెన్, హెల్పర్స్..... సినిమాకు ఎంత మంది పనిచేయాల్సి ఉంటుందో అన్ని విభాగాల వారిని తెలంగాణ ప్రాంతం నుంచే తీసుకుని 'హోరాహోరి' సినిమాలో నింపేశాడట తేజ. తెలుగు సినీపరిశ్రమలో ఇది మొట్టమొదటి రికార్డుగా సినీవర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇప్పటివరకు సినీవర్గాలు తమకు నచ్చినవారిని ఎంపిక చేసుకోవడంలో ఎక్కువ ప్రాధాన్యతని ఏపీ ఫిలించాంబర్‌కే ఇచ్చేవట. కానీ మొదటిసారి ఒక సినిమాకు అవసరమైన సిబ్బంది మొత్తాన్ని తెలంగాణ ఫిలిం చాంబర్ నుంచి తీసుకోవడం తేజ మొదటి వాడు కావడం విశేషం. ఆరు కోట్ల ఖర్చుతో తీస్తున్న ఈ సినిమాకు మరికొంత ఖర్చు తగ్గించినట్టు చెబుతున్నాడు డైరెక్టర్ తేజ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ