లేడీస్ టైలర్ సీక్వెల్ కు హీరో కుదిరాడు

August 27, 2015 | 03:40 PM | 1 Views
ప్రింట్ కామెంట్
vamshi_raj_tarun_ladies_tailer_sequel_niharonline

లేడీస్ టైలర్ అనగానే చాలా మందే గుర్తుకు వస్తారు... రాజేంద్ర ప్రసాద్... తనికెళ్ళభరణి, బట్ల సత్యం...(మల్లికార్జున రావు) ముఖ్యంగా దర్శకుడు వంశి. ఈ సినిమా ఎప్పుడు చూసినా నవ్వులతో సాగే చక్కటి సస్పెన్స్ సినిమా. ఆయనకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ఈ లేడీస్ టైలర్ కు సీక్వెల్ తీయాలనేది. అది ఇప్పటికి ఓ దశకు చేరుకునే సమయం ఆసన్నమైంది.  మచ్చ ఉన్న అమ్మాయి కోసం జమజచ్చ జమజచ్చ అంటూ రాజేంద్రుడు చేసిన అల్లరి... నల్లనమ్మ అర్చన అందం.. ఇందులో ప్రదీప్ శక్తి విలన్ గా నటించాడు. ఈ సినిమాకు రచయిత తనికెళ్ల భరణి. 
ఈ సినిమాను రవితేజతో ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ తీసినప్పటి నుంచి అతడితోనే ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ టైటిల్ తో తీయాలనుకున్నారట. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు తరువాత వంశి సినిము దాదాపు ఆరు వచ్చాయి. కానీ ఒక్కటి సక్సెస్ కాలేదు. ఈ లోగా రవితేజ టాప్ కు చేరుకున్నారు.  ఇప్పుడు ఆయన ఈ సీక్వెల్ చేస్తారా? హీరో అందకపోయినా సినిమా కోరిక మాత్రం తీరలేదు ఈ డైరెక్టర్ కు... అందుకే ఆ ప్లాన్ కార్యరూపం దాల్చనుంది ఇప్పుడు. లేడీస్ టైలర్ కు కథ మాటలు అందించిన తనికెళ్ల భరణే సీక్వెల్ కు కూడా కథ అందించారట. మధుర శ్రీధర్ ఈ సినిమాకు నిర్మాణ సారథిగా వ్యవహరిస్తారట. ప్రస్తుతం వంశీ ఏకాంతంగా గడుపుతూ స్క్రిప్టును పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు. ఇక హీరో ఎవరనుకుంటున్నారు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తమామ సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ ను ఇందులో హీరోగా ఎంపిక చేశాడట వంశి. రవితేజ అందుబాటులో లేకపోతేనేం... అలాంటి యాసతో మాట్లాడి నవ్వించే హీరో దొరికాడు వంశీకి. ఈ సీక్వెల్ సినిమా అయినా వంశీకి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ