కొత్త టెక్నాలజీ సౌండ్ తో బాహుబలి ట్రైలర్

May 27, 2015 | 01:34 PM | 21 Views
ప్రింట్ కామెంట్
SHIVUDU_FIRST_LOOK_niharonline

బాహుబలి చిత్రం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ చిత్రం టేకింగ్ అంతా కొత్త ప్రయోగంతో మొదలవుతుందని తెలిసిపోతోంది. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందంటే... ఈ సినిమా ఏ విధంగా ఉంటుందనేది ఊహకు అందడం లేదు.  'బాహుబలి' సినిమా హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ జూన్ 1న విడుదల చేస్తున్నారట. కటింగ్ ఎడ్జ్ డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులకు హై క్వాలిటీ సౌండ్ ఎఫెక్ట్స్ అందిస్తుందంటున్నారు. తెలుగులో తొలిసారిగా 'బాహుబలి'  కోసం ఈ టెక్నాలజీ వాడారు. ప్రసిద్ధ ఇంజనీర్ పి.ఎం. సతీష్ ఈ సినిమా సౌండ్ డిజైనింగ్, సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు చూస్తున్నారు. రెండు నిమిషాల 5 సెకన్ల ఈ ఫస్ట్ థియేటరికల్ ట్రైలర్ అత్యద్భుతంగా ఉందని ఇప్పటికే చూసినవారు చెబుతున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ