ఈరోస్ సీన్ రివర్స్ అయ్యింది

August 17, 2015 | 10:49 AM | 6 Views
ప్రింట్ కామెంట్
eros_international_2015_collections_in_india_niharonline

గతేడాది ఇండియాలో భారీ భారీ చిత్రాలను కొనుగోలు చేసి భంగపడ్డ అంతర్జాతీయ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్. రజనీ కాంత్, మహేష్ బాబు లాంటి సౌత్ స్టార్లతోనే కాదు... బాలీవుడ్ లో కూడా పెద్ద చిత్రాలను కొనుగోలు చేసి గతేడాది ఈ సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసింది. సినీ జనాలంతా పాపం అనుకున్నారు. అయితే పరిస్థితి మారింది. ఈ ఏడాది ఈరోస్ వాళ్ల పంట పడింది. అది మాములుగా కాదు...  నిరుడు మహేష్ వి 1 నేనొక్కడినే, ఆగడు సినిమాలు డిజాస్టర్లు అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే మరోవైపు తమిళ్ లో  కూడా లింగా అట్టర్ ఫ్లాప్.

                                       కానీ, ఈ ఏడాది మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. నిరుడు ఈరోస్ ఆదాయం రూ.242 కోట్లు కాగా.. ఈసారి అది రూ.472.48 కోట్లకు చేరుకుంది. అంటే పెరుగుదల 95 శాతమన్నమాట.  ప్రథమార్ధంలో బాలీవుడ్ లో ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ సినిమా కు వాళ్లు పెట్టిన పెట్టుబడి కంటే మూడు రెట్ల లాభాలు తెచ్చింది. ఇక ద్వితియార్థంలో  అయితే ఈరోస్ వాళ్లకు అదృష్టం మాములుగా పట్టలేదు. సల్మాన్ నుంచి ‘భజరంగి భాయిజాన్’  లాంటి భారీ బ్లాక్  బస్టర్ వాళ్ల సొంతమయ్యింది. వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్ల వసూళ్లు సాధించి ఈరోస్ కు భారత్ నుంచి పెద్ద లాభాన్ని చేకూర్చింది. ఇటు సౌత్ లో కూడా వాళ్ల సుడి మాములుగా లేదు. రెండు ఫ్లాపులు ఇచ్చినప్పటికీ మహేష్ మీద నమ్మకంతో ‘శ్రీమంతుడు’ పై వరుసగా మూడోసారి పెట్టుబడి పెట్టారు. దాదాపు రూ.70 కోట్లతో కొనుగోలు చేసింది. ఇక  సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఫుల్ రన్ లో ఈరోస్ వాళ్లకు భారీ లాభాలు మిగల్చడం ఖాయం. గతేడాది చేదును చవిచూసిన ఈరోస్ కి ఈ ఏడాది మాత్రం భీభత్సమైన లాభాలతో కాసుల వర్షం కురుస్తుంది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ