చాలా రోజులుగా రిలీజ్ వాయిదా వేస్తూ అనేక అవాంతరాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న కిక్ 2 ఇప్పటికి సెన్సార్ బోర్డుకు వెళ్ళింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమాకు సెన్సార్ వారు –ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న కిక్2కు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 21న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అనూహ్యంగా సెన్సార్ ఈ సినిమాకు సెన్సార్ బృందం పెద్ద షాకిచ్చింది. దీంతో ఈ చిత్ర బృందం ఫ్యామిలీ ఆడియెన్ థియేటర్లకు రారనే ఉద్దేశంతో రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ సోమవారం రివైజింగ్ కమిటీ కిక్ 2 చిత్రాన్ని వీక్షిస్తుంది. ఎ సర్టిఫికెట్ 'యుఎ'గా మారుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
సురేందర్ రెడ్డి 'డబుల్ కిక్' అంటూ గ్లామర్ డోస్ పెంచేయడం వల్లే ఇలా జరిగిందా? మని ఈ సినిమాలో ఉన్న మషాలా ఏమిటో సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు.