మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకు వచ్చినంత క్రేజ్ ఇంతకు ముందు ఏ సినిమాకూ రాలేదు. ఈ సినిమాకు ఈరోస్ సంస్థ వరల్డ్ వైడ్ హక్కులను తీసేసుకుంది. ఈ సినిమా తెచ్చిన హైప్, మహేష్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని 80 కోట్లకు ఈ సినిమా హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా జరిగిన అమ్మకాలు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ ఇక ఈరోస్ కే చెందుతాయి. ఈ డీల్ లో ఇటు మహేష్ కు, అటు మైత్రీ మూవీస్ కు మంచి లాభాలు వచ్చాయంటున్నారు. ఈరోస్ సంస్థ ఇంతకు ముందు కూడా మహేష్ ఆగడు, 1 సినిమాలు కొనుగోలు చేసింది. ఆ సినిమాకు సంబంధించిన లావాదేవీలు ఇటీవలే సెటిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలకు 300 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఆఫర్ ను మహేష్ ఒప్పుకుంటే టాలీవుడ్ లో ఇలాంటి భారీ ఆఫర్ అందుకున్న టాప్ హీరోగా మహేష్ మరో కొత్త సంచలనానికి శ్రీకారం చుట్టిన వాడు అవుతాడు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ప్రముఖ అంతర్జాతీయ సినిమా నిర్మాణ సంస్థ ఈరోస్ ఈ ఆఫర్ ను మహేష్ ముంగిట పెట్టింది అని టాక్. ఇది ఎన్ని సినిమాలకు ఈ మూడు వందల కోట్ల డీల్ ఏ విధంగా అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.