బీదాతి బీద, పేదాతి పేద జమీందార్లు!

March 13, 2015 | 05:26 PM | 30 Views
ప్రింట్ కామెంట్
dasari_narayanarao_1_niharonline

సినిమా వాళ్ళంతా కోట్లకు కోట్లు ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారంటూ ప్రతి సంవత్సరం పేపర్లలో వార్తలు చదువుతూనే ఉంటాం. ఇంతేసి రెమ్యునరేషన్ తీసుకుంటారు కానీ పన్నులు మాత్రం ఎగ్గొట్టేస్తుంటారని సామాన్యులందరూ సినిమా వాళ్ళను తప్పు పడుతుంటారు కూడా. కానీ ఈ విషయమై ఫిలిం చాంబర్లో వాడివేడిగా చర్చ జరిగింది. ఇన్ కం టాక్స్ అధికారులతో కలిసి జరిగిన ఈ సమావేశంలో చాలా విషయాల గురించి మనసు విప్పి మాట్లాడారు ఇండస్ట్రీలో పని చేస్తున్న వారంతా. దాసరి అయితే ఏకంగా ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్లంటూ కోట్లకు కోట్లు లెక్కలు చెపుతుంటారని ఆ లెక్కలన్నీ అవాస్తవాలే అంటూ కఠోరవాస్తవాన్ని వెల్లడించారు. ఇది అసలు పరిశ్రమ కాదనీ, ఇదొక అనార్గనైజ్ డ్ సంస్థ మాత్రమేనన్నారు. మాకు వచ్చే ఇన్ కమ్ పబ్లిసిటీ ఇన్ కమ్. ప్రొడక్షన్, లైట్ బాయ్స్ నుంచి హీరో వరకు అందరితో టీడీఎస్ పేరుతో దోచుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం. మూడు కోట్లు ఖర్చు చేస్తే నాలుగు కోట్లు లాస్ అవుతున్న ఏకైక ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీయే నన్నారు. ఒక సినిమాకు మూడు కోట్లు ఖర్చు చేస్తే మరో కోటి పబ్లిసిటీ కోసం, థియేటర్ల పే బ్యాక్ కోసం ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు.  ఇక సినిమా వాళ్లకు ఇళ్ళు రెంట్ కు ఇవ్వడం లేదు. బ్యాంక్స్ లోన్స్ అసలే ఇవ్వదు. కనీసం ఈఎంఐ లకు కూడా ఒప్పుకోవడం లేదన్నారు. అన్ని రంగాలు మమ్మల్ని గుర్తించినా, కానీ ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంటు మాత్రం గుర్తించడం లేదన్నారు. జయభేరి అధినేత మాగంటి మురళీ మోహన్ సితార సినిమాలో భేషజాలకు పోయే జమీందారీ పాత్ర శరత్ బాబుని తలపించే ద్రుశ్యాన్ని కళ్లకు కట్టి చూపారు. మేం వేసుకొనే రంగు రంగుల జరీ కోట్ల వెనుక చిరుగుల చొక్కాలుంటాయని చెప్పగా ఎవరూ నవ్వకుండా శ్రద్ధగా విన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ, ఒక హీరో ఒక హీరోయిన్గా ఇండస్ట్రీలో పని చేయాలంటే నిత్యం ఫిజికల్ ఫిట్ నెస్, కాస్ట్యూమ్, ఫుడ్ లాంటి చాలా రకాల మెయింటనెన్స్ ఖర్చులు ఉంటాయనీ, ఇవన్నీ ఎవరికీ కనపడని కోట్ల రూపాయల ఖర్చు. కానీ బయటకు మాత్రం వాళ్ళ రెమ్యూనరేషన్ మాత్రం కనిపిస్తుంది. ఇవన్నీ ఇన్ కం టాక్స్ అధికారులు గమనించాలి. అని అన్నారు.  ఇన్ కం టాక్స్ ఆఫీసర్ సురేష్ బాబు మాట్లాడుతూ, టాక్స్ డిడక్షన్, టీడీఎస్ లో చేంజెస్ నా పరిధిలో ఉండవు. పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయాలు అవి. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో పెట్టండనీ,  నటుల ఖర్చులు కూడా వారి దృష్టికి తేవాలని అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ