యూఎస్ లో తొలి రోజు కలెక్షన్లలో ‘బాహుబలి’ నెం.1

July 11, 2015 | 03:08 PM | 3 Views
ప్రింట్ కామెంట్
baahubali_release_poster_niharonline1

 ‘బాహుబలి' చిత్రం అమెరికాలోనూ బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. యూఎస్ఏలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది. మన తెలుగోడి సత్తా చాటింది. ఇప్పటి వరకు అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం టాప్ పొజిషన్లో ఉంది. ‘పికె' చిత్రం అక్కడ తొలి రోజు 0.97 మిలియన్ డాలర్లు(రూ. 6.15 కోట్లు) వసూలు చేసింది. అయితే ‘బాహుబలి' పికె రికార్డును క్రాస్ చేసి తొలి రోజు ఏకంగా 1.30 మిలియన్ డాలర్లు(రూ. 8.24 కోట్లు) వసూలే చేసింది. ఈ సినిమా తొలి రోజే ఇంత భారీ మొత్తం వసూలు చేసిందంటే ఇంకా ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 24 కోట్ల షేర్ సాధించింది. ఇదీ కాక తెలుగు ఓవర్సీస్ మార్కెట్, తమిళ వెర్షన్, హిందీ వెర్షన్ అన్నీ కలుపుకుంటే ఎంత వసూలు చేస్తుందో ఊహకు అందని విధంగా ఉంది. తెలుగులో ఈ చిత్రం తొలి వారం పూర్తయ్యేనాటికి వసూళ్లు 100 కోట్లు దాటడం ఖాయం అనుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే నాటికి రూ. 70 కోట్ల పైన వసూలు చేస్తుందని అంచనా. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ