కళాతపస్వి చేతుల మీదుగా మోషన్ కాప్చర్ యానిమేషన్ స్టూడియో

June 11, 2015 | 05:36 PM | 0 Views
ప్రింట్ కామెంట్
asia_first_capture_animation_studio_vishwanath_niharonline

జుకి యానిమేషన్ రంగం పట్ల యూత్ లో  క్రేజ్ పెరుగుతోంది. అదే కారణంతో హైదరాబాద్ నగరంలో ఎన్నో యానిమేషన్ సంస్థలు నెలకొల్పబడ్డాయి. అదే క్రమంలో ఏషియా లోనే తొలిసారిగా మోషన్ కాప్చర్ అనిమేషన్  స్టూడియో 'క్రియేటివ్ మెన్టోర్స్' అనే యానిమేషన్ స్టూడియో హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ యానిమేషన్ స్టూడియోను గురువారం హైదరాబాద్ లో సీనియర్ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్  ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "నా జీవితంలో మొదటిసారిగా ఇలాంటి ఓ క్రియేటివ్ యానిమేషన్ స్టూడియోను చూసాను. నేను చేసిన సినిమాలలో గ్రాఫిక్స్ కు చోటు లేదు. అందుకే నాకు ఈ టెక్నాలజీ పట్ల అంత అవగాహన లేదు. ఈ స్టూడియోను చూశాక టెక్నాలజీలలో ఇంత మార్పు వచ్చిందా అనిపిస్తుంది. ఈ టెక్నాలజీ అధ్బుతంగా ఉంది. అపరబ్రహ్మ విశ్వ మిత్ర సృష్టిలా ఉంది. ఈ సంస్థ వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. తెలుగు నిర్మాతలు, దర్శకులు ఈ స్టూడియోను వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఈ స్టూడియో హాలీవుడ్ స్టూడియోలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని భావిస్తున్నాను" అని చెప్పారు. డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ "లేటెస్ట్ టెక్నాలజీను ఇండియాకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ యానిమేషన్ స్టూడియో ప్రారంభించాం. ఈ టెక్నాలజీను ఫారెన్ లో చూసాం. అక్కడ మోషన్ కాప్చర్ చాలా పాపులర్. అదే టెక్నాలజీను మేము మార్కర్స్ లేకుండా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. గేమింగ్ లో, యానిమేషన్ లో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది" అని చెప్పారు. క్రియేటివ్ మెన్టోర్స్ సి ఈ ఓ సురేష్ రెడ్డి  మాట్లాడుతూ " ఎలాంటి మార్కింగ్  కేబుల్ కనెక్షన్ లేకుండా,  ఏషియా లోనే తొలిసారిగా మోషన్ కాప్చర్ అనిమేషన్ టెక్నాలజీ మేము ఫస్ట్ టైం తెలుగు సినీ రంగానికి పరిచయం చేస్తున్నాము. ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో 'లో' బడ్జెట్ సినిమాలను నిర్మించవచ్చు, హాలీవుడ్ సినిమాలకి ఈ మాత్రం తగ్గకుండా   మీరు అనుకున్నఆనిమేటెడ్  క్యారెక్టర్ ని  క్రియేట్ చేసుకోవచు." అని అన్నారు .

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ