‘కంచె’ కోసం 40 లక్షల భారీ సెట్టింగ్

October 08, 2015 | 05:17 PM | 1 Views
ప్రింట్ కామెంట్
rajmahal-setting-kanche-niharonline

స్వాతంత్ర్యానికి పూర్వపు పరిస్థితులు అప్పటి కట్టడాలు, ఆ కట్టుబొట్టు తీరు... అప్పటి రైల్వేస్టేషన్, ఆ నాటి రోడ్లు ఇవన్నీ ప్రత్యేకంగా సెట్ వేయాల్సిందే. ఇలాంటి ఆసక్తికరమైన కథతో రూపొందించిందే ‘కంచె’ ఈ సినిమాకు భారీగానే ఖర్చు పెట్టాల్సి వచ్చిందట. చిత్రంలోని ప్రతి బిట్ ఆనాటి పరిస్థితులను బట్టి తీయాలంటే ఎంతో శ్రమిస్తే గానీ 80 ఏళ్ళ వెనక్కి వెళ్ళి చూడలేం... ఇలాంటి కథ కోసం వరుణ్ తేజ్ ను ఎంపిక చేయడం ఆయన కెరీర్ మంచి బ్రేక్ గా మాట్లాడుకుంటోంది ఇండస్ట్రీ. ఇక క్రిష్ గురించి చెప్పాలంటే కెరీర్ ప్రారంభం నుంచే గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ లాంటి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న డైరెక్టర్. ఈ సారి 1935- 45 టైం లోకి వెళ్లి అక్కడి పరిస్థితులు మరియు అప్పటి వరల్డ్ వార్ II చుట్టూ కథని అల్లుకుంటూ ఈ కథను చేశారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ఇటీవలే సెన్సార్ ని కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి ‘యు/ ఏ’ సర్టిఫికేట్ తో పాటు సూపర్బ్ సినిమా తీసారనే కితాబులను కూడా అందుకున్నారు.
తాజాగా ఈ సినిమా కోసం వేసిన ఓ భారీ హౌస్ సెట్ గురించిన అంశాలు తెలిసాయి. ఈ సినిమాలో హీరోయిన్ పెద్ద జమిందార్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆ జమిందార్ హౌస్ కోసం ఓ కోట లాంటి భవనాన్ని సెట్ గా వేసారు. ఈ భవనానికి 40 లక్షలు ఖర్చు పెట్టారు. అంతే కాకుండా అప్పటి చెన్నై సెంట్రల్ క్లబ్, ఒక రైల్వే ట్రాక్ సెట్ తో పాటు ఒక గ్రామం మొత్తాని తమకు తగ్గట్టు సిద్దం చేసారు. ఇలాంటి వాటి కోసం ఈ సినిమాలో భారీగానే ఖర్చు చేశారట.
వరుణ్ తేజ్ సరసన ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్నాడు. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ