సెలబ్రిటీల సినిమా ఖర్చు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకందకుండా పోతోంది. ఈ మధ్యనే విశ్వసుందరి ఐశ్వర్య కూతురు ఆధ్య కోసం ప్రత్యేకించి ఒక వానిటీ వ్యాన్ తయారు చేసి, అమ్మ ఎక్కడికెళితే అక్కడికి పంపేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు మరో వార్త ఐశ్వర్య సెక్యూరిటీ కోసం ఏకంగా 40 లక్షల అదనపు ఖర్చు ఆ నిర్మాతకు అవుతోందట. ఈ అందాల భామను సినిమాకు ఒప్పించడం ఒక ఎత్తయితే, ఈమెకు రక్షణ కల్పించడం మరో ఎత్తు. ఈ ఖర్చంతా ఆ నిర్మాతలే భరించాల్సి ఉంటుంది. చాలా కాలం తర్వాత ఐశ్వర్య సినిమాల్లో నటిస్తుండడంతో ఆమెను చూడ్డానికి అభిమానులు ఎగబడుతున్నారట. మరి సెక్యూరిటీ పఠిష్టంగా ఉండాలంటే ఆమె ఇంటి నుంచి బయలుదేరిన దగ్గరినుంచి మళ్ళీ ఇంట్లో దింపే వరకూ బాడీ గార్డులు ఆమె వెంట ఉండాల్సిందే. 12 మంది బాడీగార్డ్ లు ఈమెకు రక్షణ కల్పిస్తున్నారట. భారత ప్రధానికి ఇంత మంది సెక్యూరిటీ ఉంటారో లేదో గానీ, నిర్మాతకు మాత్రం ఈ సినిమా పూర్తయ్యే వరకూ 40 లక్షల రూపాలయల భారం పడుతోందట.