అమితాబ్ ను బుట్టలో వేసిన చిన్నది...

May 23, 2015 | 04:14 PM | 55 Views
ప్రింట్ కామెంట్
bigb_fan_reva_niharonline

ట్విట్టర్లు, ఫేస్ బుక్ ల పుణ్యమా అని ఇప్పుడు అభిమానులను నేరుగా పలకరించే అద్రుష్టం దక్కింది జనాలకు. కొందరు సెలబ్రిటీలు కూడా అభిమానుల జవాబులకు నేరుగా సమాధాలు ఇస్తూ... వారిని ఆనందంలో ముంచెత్తుతున్నారు. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ రోజూ ట్విట్టర్ లో తన అభిమానులకు పలకరిస్తున్నాడు. ఆయనకు ఉన్న కొన్ని లక్షల, కోట్ల మంది అభిమానుల్లో బాగా నచ్చిన ఫ్యాన్ ఎవరంటే... లండన్ కు చెందిన రేవా అనే అమ్మాయట. ఈ చిన్నదాని వయసు నాలుగున్నరేళ్లు. అమితాబ్ కు ఆమె అంతగా నచ్చేయడానికి కారణం... తను 2009లో విడుదలైన అమితాబ్ అల్లాదీన్ అనే సినిమా చూసి... ఆ తాతయ్య తనకు చాలా చాలా నచ్చిన మనిషని ఒకరోజు వచ్చి, తమ ఇంట్లో పడుకుంటే తనకు చాలా ఆనందంగా ఉంటుందని రేవా చెప్పింది.

ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. చిన్నారి రేవా పంపిన వీడియోను పోస్ట్ చేసి.. ''ఫ్యాన్ పిక్ ఆఫ్ ద వీక్'' అని రాశారు. అంతే దానికి 31వేలకు పైగా లైకులు, దాదాపు 2వేల షేర్లు, 1500 కామెంట్లు వచ్చి పడ్డాయి. ఆ వీడియోలో రేవా తండ్రి ఆమెను అమితాబ్ లో నీకు అంత నచ్చినదేంటని అడుగుతారు. ఆమె ''ఆయన చాలా అద్భుతంగా నటిస్తారు. నాకు నిజంగా ఆయనంటే ఇష్టం'' అని చెబుతుంది. అంతేకాదు.. అల్లావుద్దీన్ అద్భుతదీపం సినిమాలో భూతంగా ఆయన చేసిన నటనను ప్రస్తావిస్తుంది. ఆయన్ను నిజంగా కలవాలనుందని తండ్రి దగ్గర మారాం చేస్తుంది.

ఆయన వస్తే  ఆయన మీదకు ఎగిరి దూకుతానని, వెంటనే చంకెక్కేస్తానని కూడా రేవా అంటోంది. బిగ్ బీని తమ ఇంటికి టీ తాగేందుకు పిలుస్తానని రేవా చెప్పినప్పుడు  ‘ఆయన వస్తారనే అనుకుంటున్నావా’ అని తండ్రి అడిగితే.. వస్తారని అంది. ఎలాగైనా బచ్చన్ తాతయ్యను ఇంటికి పిలవాలని తండ్రిని కోరగా ఆయన సరేనంటారు. వీడియోలో రేవా తండ్రి అమితాబ్ ను ఈసారి లండన్ వచ్చినప్పుడు తమ ఇంటికి రావాలని పిలుస్తుండగా,  మధ్యలో రేవా దూరి  ''మీకు వీలైతే కాసేపు మా ఇంట్లో పడుకోరా ప్లీజ్'' అని అడిగింది. ఇంత చిన్న అభిమాని అంతలా అమితాబ్ ను అభిమానిస్తుంటే ఆయన ఉక్కిరిబిక్కిరి అయిపోరా? అందుకే ఆ చిన్నది అంతలా నచ్చేసింది...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ