మహేష్-పూరీ కాంబినేషన్ ‘ఆటో జానీ’ తరువాత....

May 23, 2015 | 03:50 PM | 54 Views
ప్రింట్ కామెంట్
puri_jagannath_clearity_with_mahesh_movie_niharonline

చిరంజీవి 150వ మూవీ పూరీ జగన్నాథ్ తో ఫిక్స్ అయిన నాటి నుంచి ఏదో ఒక రూమర్ తో పూరీ జగన్నాథ్ వార్తల్లోకి వచ్చేస్తున్నాడు. ఇది ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువైంది. తనపై మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలపై పూరి జగన్నాథ్‌ ఎంతో మనస్తాపానికి గురవుతున్నాడట. నెటిజన్ల నుంచి కూడా రకరకాల ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడట పూరీ జగన్నాథ్. చిరుతో చిత్రం ఓకే కాగానే, మహేష్‌ ప్రాజెక్ట్‌ ని ఈ దర్శకుడు పక్కన పెట్టేశాడంటూ మీడియాలో అనేక వార్తలొచ్చాయి. ఈ గాసిప్స్ పూరిని ఎంతో బాధ కలిగించాయి. ఈ విషయాన్ని ఆయన తన సన్నిహితులకు చెప్పి ఆవేదనను వ్యక్తంచేశాడట. ఆధారాల్లేని పుకార్లతో వార్తలు ప్రసారం చేయడం  ఆయన బాగానే బాధించిందట. దీంతో మళ్ళీ అభిమానులకు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రిన్స్‌ తో తాను చేయబోయే మూడో సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ అవుతుందంటూ ట్విటర్‌లో క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ప్రిన్స్‌ తో ప్రాజెక్ట్ ఉందన్న విషయం మహేష్ అభిమానులకు ఊరట నిచ్చింది. కానీ ఎప్పుడు ఆటోజానీ అయిపోతుంది... తమ అభిమాని సినిమా ఎప్పుడు మొదలవుతుందనే కొత్త ప్రశ్నలతో మళ్ళీ ట్విట్టర్లో దూరిపోతారేమో...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ