నటీనటుల వారసులు వారి నటనావారసులుగా ఆరంగ్రేటం ఇచ్చేందుకు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే అగ్ర తారల వారసులు అల్రెడీ ఇవ్వగా, తాజాగా ఆ వెయిటింగ్ లిస్ట్ లో మరికొంత మంది ఉన్నారు. కాగా తాజాగా పెళ్లిపీటల మీదకెక్కాడు రాజేంద్రప్రసాద్ తనయుడు బాలాజీ. అంతలోనే మేకప్ కూడా వేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ``త్వరలో మా అబ్బాయి సినిమాల్లోకి వస్తాడు. వాడిని పరిచయం చేసే బాధ్యతలను పెద్దాయన రామోజీరావుగారి చేతిలో పెట్టాను`` అని చెప్పుకొచ్చారు రాజేంద్రప్రసాద్. బాలాజీ ఇటీవలి కాలంలో నటనలో శిక్షణ తీసుకున్నాడట. తండ్రి బాటలో నడవాలని ఎప్పటినుంచో ఉన్నా సమయం ఇప్పుడే అనుకూలించిందని అంటున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.