మగజాతి ఆణిముత్యం గౌహర్ చెంప పగలకొట్టాడు

December 01, 2014 | 12:41 PM | 41 Views
ప్రింట్ కామెంట్

ఇటీవల ఓ చిత్రంలో కమెడియన్ సప్తగిరి ‘బాత్ రూంలో వేసుకోవాల్సిన దుస్తులు బయట వేసుకుని తిరుగుతారా’ అంటూ అమ్మాయిలపై పడి చితకబాదుతూ తెగ నవ్విస్తాడు. అయితే ఈ మగజాతి ఆణిముత్యం మాత్రం కొంచెం సీరియస్ గానే తీసుకున్నాడండోయి. టెలివిజన్ షోలకు పొట్టి దుస్తులతో ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తూ, ఏకంగా బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టేశాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఇండియాస్ రా స్టార్ అనే టీవీ షో షూటింగ్ జరుగుతున్న సమయంలో అకిల్ మాలిక్ అనే 24 ఏళ్ల యువకుడు అమాంతం స్టేజ్ పైకి వెళ్లాడు. గౌహర్ ఖాన్ ను తాకేందుకు ట్రై చేశాడు. కురచ దుస్తుల్లో ఎందుకొచ్చావంటూ అడుగుతూ చెయ్యి చేసుకున్నాడు. సిబ్బంది అప్రమత్తమై అతన్ని పోలీసులకు అప్పజెప్పారు. లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు స్పష్టం చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ