ఇటీవల ఓ రియాల్టి షో లో పొట్టి పొట్టి బట్టలతో వచ్చిందని సినీ నటి గౌహర్ ఖాన్ ను ఓ వ్యక్తి కొట్టిన విషయం తెలిసిందే. నిందితుడిని స్పాట్ లోనే అరెస్ట్ చేసిన పోలీసులు తమ వంతు విధిగా అతన్ని కోర్టులో హజరుపరిచారు. కోర్టులో ఈ 24 ఏళ్ల అఖిల్ మాలిక్ అనే కుర్రాడు ఇచ్చిన వివరణ చూసి జడ్జితో సహా అక్కడున్న వాళ్లంతా నిర్ఘాంతపోయారట. మూడు రోజులుగా ఈ షో కి జూనియర్ ఆర్టిస్ట్ గా హాజరైన అకిల్ మాలిక్ , గౌహర్ ఖాన్ ను అలా ఫొట్టి దుస్తుల్లో చూసే సరికి చాలా టెంప్ట్ అయ్యాడట. ఒకనోక దశలో ఆమెను రేప్ చేసేస్తానేమోనని భయం వేసిందట. మరెవ్వరూ తనలా ఆలోచించకూడదనే ఉద్దేశ్యంతోనే గౌహర్ ను కొట్టానని చెప్పాడు. అంతేకాదు అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకొవడం వల్లే ఆత్యాచారాలు పెరుగుతున్నాయని అన్నాడట. దీంతో షాక్ తినడం కోర్టులో ఉన్న వాళ్ల వంతు అయ్యింది. ఏం ఇప్పుడు మీవంతు అయ్యిందా?.