తెలుగు సినిమాల్లో చిలిపి టీనేజి పిల్లగా గెంతులేసి తెలుగు వారి మనసులో స్థానం సంపాదించిన జెనీలియా ఇప్పుడు తల్లయ్యింది. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జెనీలియా మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆమె భర్త రితేశ్ దేశ్ ముఖ్ వెల్లడించారు. ఇట్స్ ఏ బాయ్............... అంటూ రితీష్ ట్వీట్ చేసి... తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. రీసెంట్ గా సల్మాన్ చెల్లి పెళ్లి రిసెప్షన్లో జెనీలియా కనిపించింది. తుజే మేరీ కసమ్ (తెలుగులో నువ్వేకావాలి) ద్వారా రితేశ్ దేశ్ ముఖ్- జెనీలియా ఫ్రెండ్స్ అయ్యారు. ఈ పరిచయం వీళ్ళిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులయిన ఈ జంటకు సినీ వర్గంలోని వారంతా అభినందనలు తెలుపుతున్నారు.