మెగా ఫామిలీ మరో అందగాడు వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘ముకుంద’ సాంగ్ టీజర్ విడుదలైంది. అయితే ఈ పాట టేకింగ్ అందరినీ ఆకర్షించే విధంగానే ఉంది. వరుణ్ తేజ్ డాన్స్ చాలా బాగుందనే టాక్ వచ్చేసింది. కానీ పాట టేకింగ్ అంతా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలోని మహేష్ వెంకటేష్ ల ఇంట్రడక్షన్ సాంగ్ లా ఉందని పలువురు అనుకుంటున్నారు. దీంతో సినిమా కూడా అలాగే ఉంటుందేమోనని ఊహాగానాలు మొదలయ్యాయి. కుటుంబ కథా చిత్రాలు తీయడంలో శ్రీకాంత్ అడ్డాలకు మంచి పేరే ఉన్నప్పటికీ, వరుణ్ తేజ్ మొదటి సినిమా క్లాస్ గా కాకుండా మాస్ గా ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మంచి అందగాడుగా పేరున్న వరుణ్ కు మొదటి సినిమా మాస్ మసాలా అయితే ఆడియన్స్ లో క్రేజ్ పెరిగిపోతుందని మెగా అభిమానుల ఆలోచన. వరుణ్ సరసన పూజా హెగ్డె జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేస్తున్నారు.