చావుపై వర్మ ఫిలాసఫీ

December 06, 2014 | 03:12 PM | 30 Views
ప్రింట్ కామెంట్

అతని సినిమాలూ వెరైటీ... మాటలూ వెరైటీ... మొత్తానికీ అతనో సంచలన స్టేట్ మెంట్ల సినిమా డైరెక్టర్ గా పేరు గడించాడు. ఇప్పుడు కొత్తగా మరణం గురించిన ఫిలాసఫీ చెపుతున్నాడు. తన అభిప్రాయాలను ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా తెలియచేశాడు వర్మ. తాను అనారోగ్యంతో మంచం పట్టి ఇతరుల మీద ఆధార పడివలసి వస్తే తాను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నాడు. అంతేకాదు ఇతరులు తన బాగోగులు చూడటాన్ని తాను కలలో కూడా ఊహించుకోలేనని అంటూ, తన మరణం గురించి తనకు ముందుగా తెలిస్తే తాను ఎవరికీ తెలియని ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి పోతానని అంటున్నాడు. అంతేకాదు తన డెడ్ బాడీని ఎవరూ చూడకూడదు అనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెపుతూ చలన రహితమైన తన శరీరం ఎవరి కంటా పడకూడదని కోరుకుంటున్నానని అంటున్నాడు. అయితే మరణం తరువాత ఎవరైనా దేవుడితో కలిసి ఉంటారని ఖచ్చితంగా నమ్మితే డెత్ డేను కూడా బర్త్ డే లా సెలెబ్రేట్ చేసుకోవాలని అంటున్నాడు. అంటే ఎవరైనా చనిపోతే ఏడుపులూ పెడబొబ్బలు లేకుండా ఆనందంగా నవ్వుతూ సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట... ఇది ఆచరణలో సాధ్యమేనా? ఏమో వర్మగారి ఫిలాసఫీ అర్థం అయ్యీ... కానట్టుగా ఉంది మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ