వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ దక్షిణాది నటి మనోరమ చనిపోయారన్న వార్తలు తమిళనాట వెల్లువెత్తాయి. ఈ వార్తతో సినీరంగం మొత్తం విస్తూపోయింది. సౌత్ కు చెందిన బడా బడా సినీ ప్రముఖులు ఈ విషయమై ఫోన్లు చేసి ఆరాతీశారు. చివరకు ఇదంతా ఉత్తదే అని తేలియటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ వదంతులపై ఆమె కుమారుడు భూపతి స్పందించారు. ఈ వార్త ఎందుకు, ఎలా వ్యాపించిందో అర్థం కావటం లేదు. ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఆమె క్షేమంగానే ఉన్నారు అని ఆయన స్పష్టంచేశారు. అయితే చాలా కాలంగా ఆమె ఆనారోగ్యంతో ఉన్న వార్త తెలిసిందే. కొన్నిరోజల క్రితం బాలీవుడ్ లో మనోరమ అనే నటి చనిపోయారు. బహుశా ఆ వార్తను చూసి పొరపాటుగా భావించి చనిపోయింది సౌత్ మనోరమ అని అనుకున్నారేమో.